కెసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటీ
posted on Mar 5, 2024 @ 4:09PM
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బిఆర్ఎస్ కొత్త పొత్తులు పెట్టుకోవాలని యోచిస్తుంది. వామ పక్షాలతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న కెసీఆర్ కు కొత్తగా స్నేహం కోసం అర్రులు చాస్తున్నట్టు కనబడుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సమయంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని... నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి కలయిక ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్, బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.