ప్రత్యూష బెనర్జీ కేసులో ట్విస్ట్.. రాహుల్ లాయర్ చేతిలోకి
posted on Apr 19, 2016 @ 6:24PM
ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు మరో ట్విస్ట్ తిరిగింది. ఇప్పటికే ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు ముందే గర్భవతి అని షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. ప్రత్యూష బెనర్జీకి న్యాయం జరగాలంటూ ప్రయత్నిస్తున్న ఆమె తరపు లాయర్ సడెన్ గా బ్రహ్మభట్ ఈ కేసు నుండి వైదొలగినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ప్రత్యూష తల్లిదండ్రులు ఈ కేసు వాదించాల్సిందిగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీలేష్‌ను కోరడమేనట. ఈ నేపథ్యంలోనే నీలేష్‌తో కలిసి పని చేయడం ఇష్టం లేకే బ్రహ్మభట్ వైదొలగినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఎంటంటే నీలేష్ ఎవరో కాదు ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తరపు మొదట వాదించిన లాయర్. అయితే ఆయన రాహుల్ తరుపు వాదించనని తప్పుకున్న సంగతి విదితమే. మరి ఇంకెన్ని ట్విస్ట్ లు వస్తాయో చూడాలి.