ప్రణబ్ కూతురికి కూడా లైగింక వేధింపులు..
posted on Aug 13, 2016 @ 4:43PM
ఆడవాళ్లకు లైంగిక వేధింపులు సర్వసాధారణమే. అయితే ఈ వేధింపులకు అధికారుల కూతుళ్లు ఏం మినహాయింపు కాదు అని రుజువైంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ రాజకీయ నేత కూతురు కూడా లైగింక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. ఇంతకీ ఆమె ఎవరు... ఆ ప్రముఖ రాజకీయ వేత్త ఎవరనుకుంటున్నారా..? భారత ప్రధమ పౌరుడు..రాష్ట్రపతి.. ప్రణబ్ ముఖర్జీ.. ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ. పార్థమండల్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో తనను పలుమార్లు లైంగికంగా వేధిస్తూ మెస్సేజ్ లు పెట్టాడని.. అతను పోస్ట్ చేసిన అసభ్య మెస్సేజ్ లను స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్ బుక్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. అంతేకాదు.. మొదట్లో అకౌంట్ బ్లాక్ చేశా.. కానీ ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండకూడదని.. అందుకే అందుకే, అతను ప్రొఫైల్, అతను పంపిన మెస్సేజ్ లను స్క్రీన్ షాట్లు తీసి పోస్ట్ చేస్తున్నానని, ఇటువంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని షర్మిష్ట పేర్కొన్నారు. మొత్తానికి సామాన్యులకే కాదు ఇలాంటి వారికి కూడా వేధింపులు వస్తున్నాయంటే అశ్యర్యకరమైన విషయమే.