ప్రకాశం కాంగ్రెస్ ఖాళీ?
posted on Mar 8, 2014 6:05AM
ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ఖాళీ అవుతోంది. డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ ఇప్టికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, వివిధ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా క్రమంగా కాంగ్రెస్ కు దూరం అవుతున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి కూడా అదే దారిలో ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు మాజీ మునిసిపల్ చైర్మన్ నుంచి సర్పంచ్‌ల వరకు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కూడా ఏదో ఒక దారి చూసుకుంటున్నారు. ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభావంతో ఎక్కువ మంది జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే మరికొందరు మాత్రం సైకిల్ ఎక్కే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ మరిన్ని చిత్రాలు వెలుగుచూసేలా ఉన్నాయి.