ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి గృహ ప్రవేశం
posted on Dec 14, 2023 @ 11:10AM
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా అధికారిక నివాసం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ లోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించి గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో కూడా పూజలు చేశారు.కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేది. అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయించింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు.
ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పై రెండవ సంతకం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పై రెండవ సంతకం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వేద పండితుల మంత్రాల మధ్యలో తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ఆ తరువాత తన కుర్చీలో కూర్చొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం సంబంధించిన ఫైళ్లను అందజేశారు కార్యదర్శులు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు.కాగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో భట్టి భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.