రోడ్డు మీదకి వస్తే.. నేరుగా జైలుకే సీపీ వార్నింగ్!
posted on Apr 17, 2020 9:22AM
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీదకి వస్తే కేసు నమోదు చేస్తామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇళ్లలోనే వుంటూ ప్రజలు సహకరించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ హెచ్చరించారు. రోడ్డు మీద కనిపిస్తే జైలులో వేస్తామని సీపి వార్నింగ్ ఇచ్చారు.
లాక్ డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు సహకరిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని సీపి అన్నారు. అత్యవసరం వుంటేనే బయటికి రావాలి. లేకున్నా వాహనాలపై బయట తిరుగుతున్న వాళ్ళను జైలుకు పంపిస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
బయట తిరుగుతున్న వారి వల్ల ఇన్ని రోజుల కష్టం వృథా అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు బయటికు రాకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి పంపించవద్దని కోరారు.
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 3,500 పీటీ కేసులు నమోదు చేశారు. అలాగే 17 వేల మందిపై ట్రాఫిక్ విభాగం కేసులు నమోదు చేసి 2,724 వాహనాలను సీజ్ చేశారు.