పోలవరం కట్టి తీరుతాం: చంద్రబాబు
posted on Jul 12, 2014 @ 11:48AM
పోలవరం ప్రాజెక్టును కట్టితీరుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాగే బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. లోక్‌సభలో పోలవరం ప్రాజెక్టు బిల్లుకు ఆమోదముద్ర లభించిన నేపథ్యంలో చంద్రబాబు, యనమల మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వున్న నిబద్ధతను స్పష్టం చేశారు. అలాగే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉపయోగపడనున్న పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం తగదని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ ఆమోదించి ఇప్పుడు రచ్చ చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.