పాక్ పై మరో ఎత్తు వేసిన మోడీ...
posted on Sep 27, 2016 @ 1:02PM
యూరీ దాడి తరువాత భారత్ పాక్ ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి చూస్తుంది. ఇప్పటికే యూరీ దాడి తరువాత పాక్ పై అగ్ర దేశాలు అభ్యంతర వ్యాఖ్యలు చేయగా.. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యల వల్ల ఏకాకి అయింది. భారత్.. తాజాగా మరో ఎత్తు వేసింది. ఇప్పుడు సింధూ జలాన్ని ప్రయోగించనున్నారు ప్రధాని మోడీ. సింధు నదీ జలాల ఒప్పందంపై పునఃసమీక్షించింది. అయితే నీటి ఒప్పందాన్ని రద్దు చేయకపోయినా మరిన్ని నీళ్లు వాడుకొని పాక్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా గతంలో పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత అనుకూల దేశం) హోదాను పునఃసమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సీనియర్ అధికారులతో అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. పాకిస్థాన్‌కు ఆ హోదా ఉంచాలా తీసేయాలా అన్నదానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.