కోట్లు పలికిన మోదీ కోటు... గిన్నిస్ కి ఎక్కింది!
posted on Aug 20, 2016 @ 4:27PM
గుర్తుందా.... ఆ మధ్య రాహుల్ గాంధీ మోదీని సూట్, బూట్ ప్రధాని అని వెటకారంగా అన్నాడు! ఇప్పుడు ఆ మాట మోదీకి సగర్వంగా సూట్ అయిపోయింది! రాహుల్ గాంధీ ఉద్ధేశ్యం ఏదైనా మోదీ సూటు మాత్రం ఇప్పుడు గిన్నిస్ కి ఎక్కింది. ఆయన ప్రత్యేకతల్లో మరొకటిగా చేరిపోయింది! గిన్నిస్ రికార్డ్ సృష్టించిన మోదీ సూటు ఆ మధ్య ఒబామా భారత్ కి వచ్చినప్పుడు ఆయన వేసుకున్నది. దానిపై మోదీ పేరు బంగారుపోగులతో వుండటంతో విపక్షాలు నానా యాగీ చేశాయి. కాని, ఎప్పటిలాగే మోదీకి తన చుట్టూ ముసురుకున్న ఈ వివాదం ప్లస్ పాయింట్ గా మారింది. మోదీ ఖరీదైన సూటు గంగా నది శుద్ది కోసం ఫిబ్రవరీలో వేలం వేశారు. అప్పుడు రికార్డు స్థాయిలో 4.31కోట్లు ధర పలికింది. అంతే కాదు, తాజాగా ఈ సూటు వేలం గిన్నిస్ కి ఎక్కింది. ప్రపంచంలో ఇంతకు ముందెప్పుడూ ఒక సూటు ఇంత ధరకి అమ్ముడుపోలేదట! అలా వాల్డ్స్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సూటుగా చరిత్ర సృష్టించింది మోదీ సూటు!