మోడీ హామీలు నెరవేరినట్టా..?
posted on Aug 13, 2016 @ 5:52PM
మోడీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది. ఈ రెండు సంవత్సరాలలో ఆయన ఎన్నో హామీలు ఇచ్చుంటారు. అయితే ఆయన ఇచ్చిన హామీల్లో ఆయన కొన్ని నెరవేర్చినా.. కొన్ని మాత్రం పెండింగ్లో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఓసారి చుద్దాం..
* ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం. దీని ద్వారా దాదాపు 228 మిలియన్ల మంది ఖాతాలు తెరిచారు. అయితే అందులో 24శాతం ఖాతాల్లో డబ్బు లేదు. పేదల కోసం 'జీరో బ్యాలెన్స్' ఖాతాలు తెరిపించారు. వీటిలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు.
* స్వచ్ఛ విద్యాలయ అభియాన్ పథకం.. సంవత్సరంలోగా అన్ని పాఠశాలల్లో బాల బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలనే సంకల్పంతో ఈ పథకం ప్రవేశపెట్టారు. దీని కింద ఇంకా 4.25లక్షల టాయిలెట్లు నిర్మించాల్సి ఉంది.
* ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారిని ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ తీసుకోవద్దని మోదీ కోరారు. ఈ మేరకు దాదాపు 20 లక్షల మంది సబ్సిడీ వదులుకున్నారు. దీంతో దాదాపు లక్షా 76వేల మంది పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.
* గ్రామాల విద్యుదీకరణ: 98.1శాతం గ్రామాల్లో విద్యుదీకరణ అయ్యిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా 9,895 గ్రామాలను విద్యుదీకరించాల్సి ఉంది.
* సామాజిక భద్రత: ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాలలో 127 మిలియన్ల మంది నమోదు చేసుకున్నారు.
* గ్రామీణ భారతానికి సంబంధించి వ్యవసాయ బడ్జెట్ 44శాతం పెరిగింది. పలు గ్రామీణాభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు.
* మాజీ సైనికోద్యోగుల కోసం ఒకే ర్యాంకు.. ఒకే పింఛను పథకం ప్రవేశపెట్టారు. కానీ ఈ పథకంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో దీనిపై సైనికోద్యోగులతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.