మోడీతో టిమ్ కుక్ భేటీ.. అప్ డేటెడ్ వెర్షన్ ను ప్రారంభించిన కుక్
posted on May 21, 2016 @ 3:30PM
యాపిల్ సంస్థ అధినేత టిమ్ కుక్ భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఈరోజు ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ గల ప్రధాని అధికారి నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్'కు సరికొత్త అప్ డేటెడ్ వర్షన్ ను స్వయంగా తయారు చేయించుకుని వచ్చిన టిమ్ కుక్.. అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రారంభించారు. భేటీ అనంతరం.. టిమ్ చేతుల మీదుగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని.. టిమ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ మోడీ ట్వీట్ చేశారు. ఈ సరికొత్త వర్షన్ లో 'మై నెట్ వర్క్' పేరిట కొత్త విభాగం మొదలైంది. ఇక మీరంతా ఓ గ్రూప్ గా ఏర్పడి నాకు సలహాలు, సూచనలు పంపొచ్చు. ఇతరులతో మీ ఐడియాలను పంచుకుని చర్చించవచ్చు" అని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మరోవైపు టిమ్‌కుక్ కూడా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌కు మరోసారి రావాలనుందంటూ టిమ్ ట్వీట్ చేశారు.