మోడీ సిగ్గు చేటు కాదా..? కేరళ నెటిజన్ల ఆగ్రహం..
posted on May 11, 2016 @ 5:48PM
ప్రధాని నరేంద్ర మోడీపై కేరళ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'పో మోనే మోదీ' అంటే ఇక చాలు, ఇంటికి వెళ్లు అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టిమరీ మోడీపై మండిపడుతున్నారు. ఇంతకీ అంతలా మోడీ ఏం చేశారనే కదా..డౌట్.. అసలు సంగతేంటంటే.. కేరళ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో శాంతి భద్రతలు సోమాలియాలో కంటే దారుణంగా తయారయ్యాయని.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్య, దళిత యువతిపై అత్యాచారం.. ఇలా వేటినీ ప్రభుత్వం ఆపలేకపోయింది అంటూ వ్యాఖ్యానించారు. అంతే మోడీ 'గాడ్స్ ఓన్ కంట్రీ' (దేవుని సొంత దేశం) అని పేరున్న కేరళను సోమాలియాతో పోల్చడంతో అక్కడ యువత ఆగ్రహిస్తున్నారు. 'పో మోనే మోదీ' అంటూ విమర్శలు సందిస్తున్నారు.
ఇక కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కూడా మోడీ వ్యాఖ్యలపై స్పందించి.. దేశ ప్రధానిగా ఆయన ఇలా సంబోధించడం సిగ్గు చేటు కాదా..?. ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆయన విరుచుకుపడ్డారు.