సెప్టెంబర్ 17.. కేసీఆర్ కు మోడీ ఝలక్
posted on Sep 19, 2015 @ 11:09AM
సెప్టెంబర్ 17 ఈ తేదీ అందరికీ అంత ముఖ్యమైన రోజు కాదు కాని తెలంగాణకు చాలా ప్రాముఖ్యం ఉన్నరోజు. హైదరాబద్ ను నిజాంలు పరిపాలిస్తున్న నేపథ్యంలో అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభ బాయ్ పటేల్ వారితో పోరాడి హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేశారు. దీనికి గాను తెలంగాణ విమోచన దినంగా పేరు పెట్టలని నాటి నేటి వరకూ అనుకుంటూనే ఉన్నారు కాని ఇంత వరకూ జరిగింది లేదు. ఈ విషయంపై కేసీఆర్ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినంగా మార్చాలని చెప్పారు. కానీ అధికారం చేపట్టిన తరువాత ఆసంగతే పూర్తిగా మర్చిపోయారు. పైగా తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్2 చేస్తున్నాం కదా ఇంకా ఈ విమోచన దినం అవసరమా అని చెప్పడం గమనార్హం. ఈ ఏడాది అయితే ఆరోజు కూడా మర్చిపోయినట్టున్నారు కేసీఆర్. దాని గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు.
అయితే సెప్టెంబర్ 17 వ తేదీని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుంచుకొని మరీ దాని గురించి ప్రస్తావించి కేసీఆర్ కు ఝలక్ ఇచ్చారు. సెప్టెంబర్ 17ను కేసీఆర్ ప్రస్తావించకపోయినా మోడీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘హైదరాబాద్ రాష్ర్టాన్ని భారత యూనియన్ లో విలీనం చేసే క్రమంలో ప్రాణాలను త్యాగం చేసిన వారికి వందనాలు’’ అని మోడీ తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ తీరుపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఇక కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉన్న సంబంధాలు కూడా అంతంతమాత్రమే. ఈనేపథ్యంలో మోడీ చేసిన ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వానికి ఇంకో ఝలక్ తగిలినట్టయింది.