మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఫెయిలయ్యారు: అరుణ్ జైట్లీ
posted on May 14, 2014 @ 12:42PM
నిన్న చివరి పదవీదినాన్ని జరుపుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఫెయిలయ్యారని బీజేపీ నాయకులు అరుణ్ జైట్లీ విమర్శించారు. ప్రపంచంలో మేటి ఆర్థికవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ప్రైమ్ మినిస్టర్‌గా పూర్తిగా ఫెయిలై దేశ ప్రజల దృష్టిలో చులకనైపోయారని జైట్లీ అన్నారు. ప్రధాని మన్మోహన్ విధాన పరమైన నిర్ణయాల విషయంలో కఠినంగా వ్యవహరించి ఉంటే గౌరవం దక్కించుకునేవారని అభిప్రాయపడ్డారు. సోనియా స్థానంలో మన్మోహన్ ప్రధాని కావటంతో అనేక పరిమితులు, ఒత్తిడులకు లోబడిఆయన పనిచేశారని జైట్లీ తన బ్లాగులో అన్నారు. లోక్‌సభ ఫలితాలు వెలువడక ముందే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలన్న మన్మోహన్ నిర్ణయాన్ని జైట్లీ పొగిడారు. పీవీ హయాంలో మన్మోహన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక రంగానికి కొత్త ఉత్సాహం ఇచ్చాయని, అయితే ప్రధానిగా ఆయన విఫలమయ్యారని జైట్లీ చెప్పారు.