ప్రధాని మన్ కీ బాత్ @ 100 ఎపిసోడ్
posted on May 1, 2023 @ 10:44AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం, దేశ ప్రజలను పలకరించే కార్యక్రమం.’మన్ కీ బాత్’ కార్యక్రమం. మన్‌కీబాద్ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3న ’మన్ కీ బాత్’ ప్రారంభమైన కార్యక్రమం ఏప్రిల్ 30న ప్రసారమైన కార్యక్రమంతో వందో ఎపిసోడ్ కు చేరింది. ప్రతి నెలా చివరి ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియా, డీడీ నెట్‌వర్క్‌లో ’మన్ కీ బాత్’ ప్రసారం అవుతోంది. ఏప్రిల్ 30) న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత వుంది. ఇది ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్. నిజానికి, 2014లో తోలి సారి అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతి నెల ప్రసారమవుతున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూల్ విద్యార్ధులు మొదలు మహిళలు,వృద్ధులు, విభిన్న వృత్తుల్లో ఉన్న వ్యక్తులు,గ్రామ పంచాయతీ సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉపాద్యాయులు ..ఒకరని కాదు అందరితో ప్రత్యక్షంగా, పరోక్షంగా మాట్లాడి వారు ప్రస్తావించిన అంశాల మంచి చెడులను తమ ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు వివరించే, విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.
సహజంగానే, ప్రతిపక్షపార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, అనేక సందర్భాలలో ’మన్ కీ బాత్’ కార్యక్రమాన్నిఎగతాళి చేశారు. అయినా, ఇప్పటి వరకూ 99 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంకున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారులు తెలిపారు.
స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, వాటర్ కన్జర్వేషన్, ఆయుష్, ఖాదీ తదితర అంశాలు ఆయా ఎపిసోడ్‌లో ప్రస్తావించడం, అంతగా గుర్తింపునకు నోచుకోని వ్యక్తులను వెలుగులోకి తేవడం సహా అనేక అంశాలతో ఈ రేడియో ప్రోగ్రాం జనబాహుళ్యానికి దగ్గరైంది.ఒక విధంగా ప్రజలకు ప్రభుత్వానికి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధానితో సామాన్య ప్రజలకు ప్రత్యక్ష సంబంధం ఏర్పరచడంలో ’మన్ కీ బాత్’ ఒక వారధిగా పని చేసింది.
కాగా, మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్’ పురస్కరించుకుని ప్రసార భారతి విభిన్న తరహాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక వేడుకగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వంద నాణెన్ని కూడా విడుదలచేసింది. ఏప్రిల్ 30 జరిగేగిన మన్‌కీ బాత్ సందర్భంగా ప్రధాని మోడీ రూ.100 కాయిన్‌ను విడుదల చేశారు.
మన్‌కీ బాత్ కార్యక్రమంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆటక్ నుంచి కటక్ వరకు అన్ని ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని మోడీతో తమ అభిప్రాయాలను, ఆలోచనలు, కష్ట సుఖాలు పంచుకున్నారు. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలు చెందిన ఎందరో తెలుగువారిని గుర్తించిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో వారిని, వారి విలువైన సలహాలను,విజయాలను దేశానికి పరిచయం చేశారు.
స్వచ్ఛ భారత్ పై రామోజీరావు చేస్తున్న సేవలను కొనియాడారు. తెలంగాణాలోని తిమ్మాయిపల్లి గ్రామ ప్రజలు వర్షాకాలంలో ప్రతీ నీటిబొట్టును వృథా కానివ్వకుండా వాటిని కాలువలుగా మళ్లించి నీటికుంటలను నిర్మించారు.
ప్రధాని తిమ్మాయిపల్లి గ్రామ ప్రజలతో మాట్లాడారు, వారి దృఢ సంకల్పాన్ని మెచ్చుకున్నారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో 10 టన్నుల వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రయత్నాన్ని నరేంద్రమోదీ ప్రశంసించారు.‘ల్యాబ్ టు ల్యాండ్’ మంత్రంతో వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలు చేసిన తెలంగాణకు చెందిన చింతల వెంకటరెడ్డితో మాట్లాడి వారి కృషినీ ప్రశంసించారు. మేడారం జాతరనూ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో వయోజన విద్యను ప్రోత్సహించేందుకు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చేసిన కృషికిగాను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ఆయనపై ప్రశంసలు కురిపించారు.
విజయవాడకు చెందిన శ్రీనివాసా పడకండ్ల అనే వ్యక్తి ఆటో మొబైల్ సంబంధిత వ్యర్థ పదార్థాలతో కళాఖండాలను తీర్చిదిద్దుతున్నాడు. ప్రధాని మన్ కీ బాత్‌లో శ్రీనివాసా పేరును ప్రస్తావింఛి మెచ్చుకున్నారు.నంద్యాలలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించిన కేవీ సుబ్బారెడ్డిని కూడా ప్రధాని మన్ కీ బాత్ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో పండించే బంగినపల్లి మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేస్తారనే విషయాన్ని ప్రధాని మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రస్తావించారు. భూగర్భ జలాలను పెంచే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన నీరు ప్రగతి కార్యక్రమాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు.
మోడీ వందో మన్‌కీ బాత్ ఎపిసోడ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వీటిలో అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్ కూడా ఉంది. అక్కడ కూడా.. ప్రత్యేక అనుమతులు తీసుకుని ప్రసారం చేశారు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి.. జీ20 సదస్సుల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఇక, నగరాలు.. పట్టణాలు.. నియోజకవర్గాలు(మొత్తం 547 పార్లమెంటుస్థానాల్లో), గ్రామాల్లోనూ పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి.. ప్రసారం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతి నెలా ప్రజలతో మన్ కీ బాత్ పేరుతో రేడియోలో జరిపే సంభాషణల్లో మనకు ఆత్మస్థైర్యాన్ని, స్ఫూర్తిని అందిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దేశ ప్రజల్లో అనేకమంది మౌనంగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని, అంతర్జాతీయ స్థాయిలో దేశం తలెత్తుకుని గర్వంగా జీవించేలా చేస్తున్నారని ప్రధానమంత్రి మొత్తం ప్రపంచం దృష్టికి తన ప్రసంగాల ద్వారా తీసుకువస్తున్నారని అంటున్నారు.