కమలం గూటికి చేరిన పిఎల్ శ్రీనివాస్
posted on Feb 16, 2024 @ 3:48PM
లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఇటీవల బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య పెరిగింది. శుక్రవారం కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఇతర నేతల సమక్షంలో... పీఎల్ శ్రీనివాస్, ఆయన కూతురు, ప్రముఖ విద్యావేత్త అలేఖ్య ఆ పార్టీ జెండాను కప్పుకున్నారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బీజేపీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పీఎల్ శ్రీనివాస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో రాష్ట్ర, జాతీయస్థాయుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 90వ దశకంలో కాన్షీరాం స్థాపించిన బిఎస్పి నుంచి ఆయన సనత్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీలో ఓడిపోయారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వివిధ హోదాల్లో పనిచేసిన పీ.ఎల్.శ్రీనివాస్, ఆయన కుమార్తె, ప్రముఖ విద్యావేత్త పి.ఎల్.అలేఖ్య బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాంచందర్‌రావు, కార్పొరేటర్లు రాకేష్ జైస్వాల్, కొంతం దీపిక, బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.శ్యామ్ సుందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, పెద్ది రవీందర్ తదితరులు పాల్గొన్నారు.