Read more!

పట్టుదల, అంకిత భావం పంచుమర్తి విజయ రహస్యం

పార్టీ పట్ల అంకిత భావం, పని పట్ల శ్రద్ధ, సాధించాలన్న పట్టుదల ఇవే పంచుమర్తి అనూరాథ ప్రత్యేకతలు. కష్టంలోనూ కర్తవ్యాన్ని విస్మరించకపోవడం, పదవుల కన్నా ప్రజాసేవే మిన్న అన్న భావం ఆమెను ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయతీరాలకు చేర్చాయి. రాజకీయ ప్రవేశంతోనే ఆమె  విజయవాడ నగర మేయర్ గా ఎన్నికయ్యారు. తాజాగా ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

పంచుమర్తి అనురాధ సరిగ్గా 23 ఏళ్ల కిందట రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? అతి చిన్న వయసులోనే మేయర్‌గా  ఎన్నికయారు?  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన  అనంతరం   పంచుమర్తి విజయం విజయం తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. రెట్టింపు ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రయాణమూ సంచలనమే . ఆమె కుటుంబానికి  రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు.  తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్‌ఎస్‌. ఆదాయపన్నుశాఖలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేశారు. తల్లి గృహిణి. అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు.

 ప్రాథమిక విద్య హైదరాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌లో చదివిన పంచుమర్తి అనూరాథ హైస్కూల్‌, ఇంటర్‌ విద్యను విజయవాడలోనూ,  పూర్తి   బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ను గుంటూరు జేకేసీ కళాశాలలో పూర్తి చేశారు.  ఆ తర్వాత  ఆమె   నాగార్జున యూనివర్సిటీ నుంచి నుంచి జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌  చేశారు. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఎవరికీ రాజకీయాలతో సంబంధంలేకపోయినా ఆమె అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చారు.  2000 సంవత్సరంలో 26 ఏళ్ల పిన్న వయస్సులో విజయవాడ మేయర్‌ పదవిని దక్కించుకున్నారు. విజయవాడ మేయర్ పోస్టును మహిళలకు రిజర్వ్ చేసిన విషయాన్ని వార్తా పత్రికలో చదికి ఆసక్తితో  తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపారు. అప్పట్లో   మేయర్‌ పదవికి డైరెక్ట్ ఎలక్షన్ జరిగేది.   తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా మేయర్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీ అంటే స్వతహాగా ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు, పంచుకున్న అభిప్రాయాలు నచ్చాయి. అంతేకాదు, విద్యారంగపైన   అనురాధకు చక్కటి అవగాహన ఉందని గ్రహించిన చంద్రబాబు ఆమెనే ఎంపిక చేశారు.

అప్పుడు జరిగిన మేయర్ ఎన్నికలలో   కాంగ్రెస్‌ నుంచి నాగరాణి, కమ్యూనిస్ట్‌ పార్టీల అభ్యర్థి తాడి శకుంతల ను ఓడించి 6800 కు పైగా ఓట్ల మెజారిటీతో  అనురాధ విజయం సాధించారు. డైరెక్ట్ ఎన్నికలలో మేయర్ గా ఎన్నికైన అనురాధ తొలి నాళ్లలో రాజకీయ అనుభవం లేక ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అనతి కాలంలోనే అన్ని విషయాలలోనూ నైపుణ్యం సంపాధించారు.  మేయర్‌ పదవీ కాలం పూర్తయిన తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని ఆమె భావించలేదు.

కానీ  2007 నుంచి మళ్లీ తెలుగుదేశంలో క్రియాశీలంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆక్రమంలో  2009లో మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ సీటు  బీజేపీకి  తెలుగుదేశం కేటాయించింది.   దీంతో పోటీ చేయడం కుదరలేదు. అయితే పార్టీలో పలు పదవులు నిర్వహించారు.  అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడమే కాకుండా ఘన విజయం సాధించారు.