తిరుమలలో పెప్సీ పాగా ?
posted on Aug 27, 2012 @ 9:57AM
గ్లోబలైజేషన్ పేరుతో ఇప్పటికే దేశంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలను ఆక్రమించుకున్న మల్టీనేషనల్ కంపెనీలు హిందూలను కూడా వదిలిపెటట్టటంలేదు. మరీ ముఖ్యంగా దేశంలో పేరుపొందిన దేవాలయాలలో పాగా వేశాయి. దానిలో భాగంగానే దక్షిణభారతదేశంలో పేరెన్నికగన్న ఆపదమొక్కుల వాడు వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. తిరుమలలోని వైకుంఠ మార్గంలో పెప్సీ కంపెనీ ఆధిపత్యం సాదించింది. అంతకు ముందు అదే ప్రదేశంలో అక్కడ చిరు వ్యాపారులు ఉండేవారు.వారిని భద్రతాకారణాల పేరు చెప్పి దేవస్దానం ఖాళీచేయించింది. ఇప్పుడు అదే ప్రాంతంలో పెప్సీకి అనుమతి ఇవ్వడం వల్ల చిరు వ్యాపారులు విస్తుబోయారు. స్వామి దర్శనానికి సాంప్రదాయ పద్దతులతో భక్తి ప్రభక్తుల్తో, సాంప్రదాయంగా రావాలని ఆదేశించిన దేవస్ధానం ఇలా మల్టీనేషనల్ కంపెనీల శీతల పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దానికన్నా సాంప్రదాయ పానీయాలైన పాలు, మజ్జిగ, పళ్ల రసాలు లాంటివి పెడితే భక్తులకు ఆరోగ్యానికి మంచిదని, అలాగే చిరువ్యాపారులకు ఊత మిచ్చినట్లుంటుందని సాంప్రదాయవాదులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సత్వరమే స్పందించి సరైన నిర్ణయం తీసుకొని సామాన్యులకు ఆసారాగా వుండాలని స్దానికులు అధికారులను కోరుతున్నారు.