ప్రజా భాగస్వామ్యంతో తెలుగుదేశం కూటమి ఎన్నికల మేనిఫెస్టో
posted on Apr 9, 2024 8:49AM
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడిగా ప్రజల మేనిఫెస్టో ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. మేనిఫెస్టో రూపకల్పనలో కూటమి ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సంకల్పించింది.
ఇందు కోసం కూటమి భాగస్వామ్య పక్షాలు మూడూ ప్రజల నుంచి సూచనలను, సలహాలను ఆహ్వానిస్తున్నాయి. ప్రజలు కూటమి మేనిఫెస్టో రూపకల్పనలో భాగస్వాములు కావాలని కోరుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ప్రజలు తమ సూచనలూ, సలహాలూ తెలియజేసేందుకు వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ ఇంకా పీడీఎఫ్ రూపంలో పంపించాలని కోరుతోంది. ఇందు కోసం కూటమి ఒక ఫోన్ నంబర్ ను ఇచ్చింది. 8341130393 నంబర్ కు వాట్సాప్ ద్వారా ప్రజల ఉమ్మడి మేనిఫెస్టో కోసం తమ సూచనలూ, సలహాలూ పంపాలని ఆహ్వానించింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకే కూటమి మేనిఫెస్టో ఉంటుందని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి, పురోగతి, అభివృద్ధే తెలుగుదేవం కూటమి లక్ష్యమని కూటమి నాయకత్వం చెబుతోంది. ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని రంగాలలోనూ అధమ స్థానానికి దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా కూటమి పని చేస్తోందని పేర్కొంది. ఇలా ఉండగా కూటమి మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న యోచనను నెటిజన్లు స్వాగతిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ఆహ్వానానికి ప్రజల నుంచి కూడా అనూహ్య మద్దతు, స్పందన లభిస్తోంది. వివిధ వర్గాల ప్రజలు కూటమిలో పొందుపరచాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు, సలహలూ, సూచనలను పెద్ద ఎత్తున పంపుతున్నారు.