ఎవరూ జైలులో ఉండాలని కాంగ్రెస్ కోరుకోదు: చాకో
posted on Sep 24, 2013 @ 8:40PM
బెయిలుపై విడుదల అయిన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంత వరకు ఇంటికి కూడా చేరుకోలేదు. కానీ కాంగ్రెస్స్ పార్టీలో అప్పుడే ప్రతిస్పందనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎవరూ జైలులో ఉండాలని కోరుకోదని అన్నారు.
"ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది గనుక అప్పటిలోగా తేలాల్సిన వ్యవహారాలు చాలానే ఉన్నాయి. అందువలన పొత్తుల గురించి ఇప్పటి నుండే మాట్లాడటం అనవసరం. జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యాడు. అతనిని ఆ సంతోషం పూర్తిగా అనుభవించనీయండి. అతని విడుదలపై వస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధము లేదు,” అని అన్నారు.
దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మేలే కోరుకొంటున్నదని, అదేవిధంగా పొత్తులకి అవకాశం కూడా ఉందని స్పష్టం అవుతోంది. అలా కాకుంటే పొత్తుల ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పేవారు. కాంగ్రెస్-వైకాపాలు ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి మాట్లాడకపోయినా ఎన్నికలు దగ్గరపడేలోగా అందుకు తగిన సానుకూల వాతావరణం కల్పించుకోవచ్చును.