సీఎం జగన్ పై పాయల్ హాట్ కామెంట్స్
posted on Dec 14, 2020 @ 4:26PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సినీనటి, ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మార్గాని భరత్ రామ్ తో కలిసి పాయల్ రాజ్ పుత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. స్టార్స్ అందరూ డిసెంబర్ నెలలోనే పుడుతారని.. మన డైనమిక్ సీఎం జగన్ తోపాటు తాను కూడా డిసెంబర్ లోనే పుట్టానని అన్నారు. ఏపీలో సీఎం జగన్ క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని కొనియాడారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేదానినని తెలిపారు. రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉందని.. గోదావరి అందాలు చాలా బాగున్నాయని పాయల్ అన్నారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ కు క్రీడలపై ప్రత్యేకమైన అభిరుచి ఉండడం మన అదృష్టమన్నారు. సీఎం జగన్ క్రీడాకారులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, క్రీడాకారుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.