విజయవాడలో ఓటేసిన పవన్ కల్యాణ్
posted on Mar 10, 2021 @ 9:34AM
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతోంది. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతోంది. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటువేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో ఓటు వేశారు.పటమట లంకలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నెం-4కి వెళ్లిన పవన్ ఓటు వేశారు. పవన్ కల్యాణ్ రాకతో పోలింగ్ కేంద్రంలో సందడి నెలకొంది. పవన్ కల్యాణ్ రాకతో పోలింగ్ కేంద్రంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పవన్ ను చూసేందుకు ఓటర్లతో పాటు అభిమానులు పోటీపడ్డారు.
కర్నూలు జిల్లాలోని గూడూరులో ఓ పోలింగ్ కేంద్రంలో నాగు పాము హలచ్ చల్ చేసింది. మంగళవారం సాయంత్రం పోలింగ్‌బూత్ 9, 10లలో నాగుపాము కనిపించడంతో కలకలం రేపింది. స్థానికులు వచ్చి ఆ పామును పట్టుకున్నారు. అనంతరం చెట్ల పొదల్లోకి వదిలిపెట్టారు. అక్కడ నాగుపాము సంచరించడంతో పోలింగ్ సిబ్బంది భయపడిపోయారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ పోలింగ్ బూత్‌లోనే గడిపారు. ఉదయం అక్కడ యధావిధిగానే పోలింగ్ ప్రారంభమయింది.