రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకున్న న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ.. పవన్ కల్యాణ్
posted on Oct 6, 2025 @ 3:54PM
జస్టిస్ గోపాల గౌడ్ నేటి తరానికి రూల్ ఆఫ్ లా స్థాపనలో దారి చూపాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కర్ణాటక చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణిలో సోమవారం (అక్టోబర్ 6) సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల అమృతమహోత్సవ (80వ జన్మదిన) వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భాష, ప్రాంతాలూ వేరు కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్, కర్నాటక మధ్య సాంస్కృతి, సంప్రదాయాల విషయంలో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు.
కోలార్, చిక్కబళ్లాపుర్ ప్రాంతాల్లో ఉన్న నీటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫునుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య సహకార గురించి ఉదాహరణలుగా పవన్ కల్యాణ్ ఏపీలో ఏనుగుల దా డిలో పంటపొలాలు నాశనం కాకుండా కర్ణాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులు ఇచ్చి కర్ణాటక ప్రభుత్వం సహకరించిందనీ, శ్రీశైలం దేవస్థానానికి వచ్చే కర్ణాటక భక్తులకు సౌకర్యాల విషయంలో ఏపీ సానుకూలంగా ఉందనీ చెప్పారు. ఇక జస్టిస్ గోపాల్ గౌడ గురించి మాట్లాడుతూ, ఆయన తన వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకులకు అంకితం చేశారని అన్నారు.
2019 ఎన్నికలలో తాను పరాజయం పాలైన సమయంలో తనకు ధైర్యం చెప్పిన వ్యక్తి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ అని పవన్ కల్యాణ్ చెప్పారు. న్యాయమూర్తిగా ఆన ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చి జస్టిస్ గోపాల గౌడ వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకుల కోసం అంకితం చేసుకున్నారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన ఎన్నో కీలక తీర్పులు చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. భూ ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినా అడ్డుకున్నారని అన్నారు. అలాగే జస్టిస్ గోపాలగౌడ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ రాజకీయ ధృక్పథం తనకు ఇష్టమన్నారు.