ఇక మీదట అక్కడ కనిపిస్తే కాల్చివేత…
posted on Feb 4, 2016 @ 10:09AM
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద తీవ్రవాదుల దాడితో చావుతప్పి కన్నులొట్టపోయినట్లయింది మన రక్షణ దళాల పరిస్థితి. తీవ్రవాదులు అంత సులువుగా పఠాన్‌కోట్‌లాంటి స్థావరంలోకి ప్రవేశించడానికి కారణం మన రక్షణ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లే అని తేల్చేశారు రక్షణరంగ నిపుణులు. సమయానికి దేశ సైనికులు అప్రమత్తతో వ్యవహరించి ప్రాణాలకు తెగించి పోరాడబట్టి దేశం పరువు నిలిచింది. లేకపోతే పఠాన్‌కోటలో వేల కోట్ల విలువైన విమానాలను తీవ్రవాదులు ధ్వంసం చేసి ఉండేవారే. అందుకే ఇప్పడు పశ్చిమ వాయుదళానికి చెందిన 20 విమానస్థావరాల వద్ద ఇప్పుడు కనిపిస్తే కాల్చివేతని అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆగంతకులు ఎవరన్నా ఈ స్థావరాల లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే హెచ్చరించాల్సిన అవసరం కూడా లేకుండా వారిని కాల్చివేయవచ్చు. ఇంతేకాకుండా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను వెచ్చించి దేశంలో ఉన్న మొత్తం 54 విమాన స్థావరాల వద్దా భద్రతని పెంచాలని నిర్ణయించింది. కాబట్టి ఇక మీదట తీవ్రవాదులు వైమానికి స్థావరాల మీద దాడి చేసే ప్రమాదాలు లేనట్లే!