రాజమండ్రిలో పాస్టర్ అనుమానాస్పద మృతి
posted on Mar 26, 2025 @ 1:50PM
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్(46) అనుమానాస్పదస్థితిలో మరణించాడు. డెడ్ బాడీపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానాలు రేకెత్తాయి. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ పక్కనే ప్రవీణ్ మృతదేహం పడి ఉంది. స్పాట్ లోనే రక్తపు మరకలతో ఉన్న కర్ర ముక్కలు ముక్కలుగా ఉండటంతో డెత్ మిస్టరీ వీడలేదు. పాస్టర్ మృతితో ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనమైంది. డెడ్ బాడీ రాజమండ్రి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం చేస్తున్నారు. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గామన్ బ్రిడ్జి రహదారిపై మృతదేహం కనిపించింది. క్రైస్తవ సంఘాలు డెత్ మిస్టరీ చేధించాలని నిరసనకు దిగాయి. పోస్టర్లు అంటించాయి. హైద్రాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ లగేజి కట్టుకుని రాజమహేంద్రవరం బయలు దేరారు. గామన్ బ్రిడ్జి టోల్ గేట్ దాటగానే పాస్టర్ మృతదేహం కనిపించింది. కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద ప్రవీణ్ కుమార్ బుల్లెట్ పల్లపు ప్రాంతంలో పడిపోయింది. ప్రమాదవశాత్తు ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న బుల్లెట్ లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై ఐటీ మంత్రి లోకేశ్ దిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు.