ఉత్తరాఖండ్ సంక్షోభంపై పార్లమెంట్లో రచ్చ..
posted on Apr 25, 2016 @ 12:42PM
పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అలా ప్రారంభమయ్యాయో లేదో.. సభ రణరగంగా మారింది. ప్రతిపక్షాలు సమావేశాలు ప్రారంభంకావడానికి ముందు నుండి ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చించాలన్న వ్యూహంతోనే సభలోకి అడుగుపెట్టాయి. ఈనేపథ్యంలో.. సభ ప్రారంభంకాగనే ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభంపై చర్చకు పట్టుబట్టాయి. మరోవైపు అధికార పక్షం.. ఈ అంశం కోర్టులో ఉన్నందున దానిపై చర్చించడం సాధ్యం కాదని.. కోర్టులో ఉన్న అంశంపై చర్చించడం సబ్ జ్యుడిస్ అవుతుందంటూ చర్చను తిరస్కరించడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ కూడా మొదటి రోజంతా ఉత్తరాఖండ్ అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని డిమాండ్ చేశారు. ఆందోళనలమధ్యే రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.