పోలవరం ప్రాజెక్టుకు మరీ ఇంత తక్కువా..
posted on Feb 29, 2016 @ 12:41PM
ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు ఈసారి కూడా అనుకున్నంత నిధులు రాలేదనే అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కేటాయించమని కోరినప్పటికీ కేంద్రం మాత్రం ఏదో నామమాత్రపు నిధులే కేటాయించింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పోలవరానికి రూ.100 కోట్లు కేటాయించారు. అయితే దీని నిర్మాణ పనులకు గాను ఏపీ ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.. కేంద్రం మాత్రం 100 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. మరి ఈ వంద కోట్లతో ఏపీ ప్రభుత్వం ఏం నిర్మాణం చేపడుతుందో చూడాలి. మొత్తానికి కేంద్రం ఇలా కొసరి, కొసరి ఇస్తే పోలవరం నిర్మాణం ఎప్పుడయ్యోనో ఏమో..