ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెను చంపేస్తాం.. అలాగే ఒబామాను కూడా.. ఐసిస్
posted on Nov 20, 2015 @ 4:06PM
పారిస్ లో గత వారం ఉగ్రవాదులు దాడి జరిపి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు పారిస్ లో దాడి జరిపినట్టే అమెరికాలో కూడా దాడి జరుపుతామని ఐసిస్ హెచ్చరించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో పారిస్, అమెరికా భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. సుమారు 6 నిమిషాలు నిడివి గల ఓ వీడియోను ఇరాక్‌లో రూపొందించారు. ఈ వీడియో ద్వారా ఓ ఉగ్రవాది అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్‌ను బాంబులతో పేల్చేస్తామని.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మరిన్ని దాడులు చేస్తామని.. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెను, అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా చంపేస్తామని హెచ్చరించాడు. ఆత్మాహుతి బాంబు దాడులు, కారు బాంబులతో మిమ్మల్ని చంపేస్తాం. మీరెక్కడికి వెళ్లినా వదిలిపెట్టం అని వీడియో ద్వారా ఉగ్రవాది బెదిరించాడు. ఈ వీడియోను విడుదల చేయడంతో అమెరికా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.