రోహిత్ ఆత్మహత్య పై దద్దరిల్లిన రాజ్యసభ..
posted on Feb 24, 2016 @ 10:59AM
పార్లమెంట్ ఉభయ సభలు మొదలయ్యాయి. రాజ్యసభ స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఉద్రిక్తత నెలకొంది. హెచ్ సీయూ, జెఎన్ యూ ఘటనలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష విపక్ష నేతల మధ్య వివాదాలు తెలెత్తాయి. ముఖ్యంగా రోహిత్ ఆత్మహత్యపై ఇరు వర్గాల మద్య ఆందోళనలు తలెత్తుతున్నాయి. దీనిలో భాగంగానే బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ముర్దాబాద్ అంటూ చైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా దళిత విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మాయవతి ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని.. వర్సిటీలలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేసే కుట్ర జరుగుతుందన్నారు. గత కొన్నేళ్ల నుంచి వర్సిటీలలో దళిత విద్యార్థులపై వివక్ష కొనసాగుతుందని మండిపడ్డారు. సెంట్రల్ వర్సిటీలలో దళిత విద్యార్థులపై వేధింపులు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.
మరోవైపు రోహిత్ ఆత్మహత్యపై ప్రతిపక్షాల తీరుపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్నారని.. రోహిత్ ఆత్మహత్యతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని.. రోహిత్ ఆత్మహత్యపై నిష్పక్షపాత విచారణ జరగాలని ఆమె అన్నారు.