కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్
posted on Aug 6, 2025 @ 4:17PM
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇరు దేశాల మధ్యా నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో పాక్ అభ్యర్థన మేరకు భారత్ సీజ్ ఫైర్ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ తరువాత తొలి సారిగా సరిహద్దుల్లో పాకిస్థాన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సైనికులు భారత సైనిక పోస్టులు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.
ప్రతిగా భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. దాదాపు పావుగంట సేపు ఈ కాల్పులు జరిగాయి. అయితే భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం కల్పించడానికే పాక్ సైన్యం కాల్పులకు తెగబడి ఉంటుందని భావిస్తున్న ఇండియన్ ఆర్మీ బోర్డర్ లో హై అలర్ట్ ప్రకటించింది.