పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి..15 మంది మృతి..
posted on Jan 20, 2016 @ 11:42AM
పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్థాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలో ఉగ్రవాదులు దాడి చేశారు. యూనివర్సిటీలో ఓ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సుమారు 3వేల మంది విద్యార్దులు దాదాపు 600 మంది అతిథులు హాజరయ్యారు. దీంతో ఇదే అదనుగా చూసుకొని 10 మంది ఉగ్రవాదులు యూనివర్శిటీలోకి చొరబడి విద్యార్దులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది మృతిచెందగా, 70మందికి గాయాలైనట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డ విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనతో పాక్ భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించింది. ఈసందర్భంగా డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సయీద్ వజీర్ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులను రక్షించేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు.