భారత్ కు పాక్ వార్నింగ్.. మా సత్తా ఏంటో భారత్‌కు తెలుసు
posted on Sep 23, 2016 @ 5:57PM
భారత్, పాక్ ల మధ్య పరిస్థితి ఇప్పుడు పచ్చగడ్డి వేస్తేనే మండిపోయేంతగా మారిపోయింది. యూరీ దాడి తరువాత ఆగ్రహంతో ఉన్న భారత్ అక్కడి సరిహద్దుల్లోని ఉగ్రవాదులను ఏరివేసే పనిలో పడింది. అయితే ఇప్పుడు భారత్ కు పాక్ హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో లక్ష్యాలను ఎంచుకున్నామని, అటు నుంచి ఏ చిన్న దాడి జరిగినా బలంగా తిప్పికొడతామని పాకిస్థాన్ హెచ్చరించింది. ఇప్పటికే బలగాలను మోహరించామని, సమీప భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైనా పాకిస్థాన్ సైన్యం మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుందని రక్షణశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. తమ సత్తా ఏంటో భారత్‌కు తెలుసని కూడా పాక్ హెచ్చరించింది. అంతర్గతంగా తమ స్థావరాలను కాపాడుకుంటూనే సరిహద్దులో భారత్‌కు సరైన సమాధానమివ్వడానికి ఆర్మీని సంసిద్ధం చేసినట్లు చెప్పింది. మరి దీనికి భారత్ ఎలా సమాధానమిస్తుందో చూడాలి.