ఆర్గానిక ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు...!

 

ఇటీవలి కాలంలో ఆర్గానిక్ ఆహార పదార్థాలకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. అసలు ఆర్గానిక్ ఫుడ్ కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ.. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటీ..? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=lsQH29XE2iI

 

నీరు అతిగా తాగేస్తున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాలి...

శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. , ప్రతిఒక్కరూ  ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలని వైద్యుల నుండి ఆరోగ్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు చెబుతారు. ఎండాకాలంలో  సాదారణం కంటే నీరు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. ఎండవేడిమి  కారణంగా, శరీరం నుండి చాలా నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. పెద్దలు రోజుకు 3-4 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల  డీహైడ్రేషన్ ప్రమాదం నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీరపనితీరు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  రక్షించడంలో సహాయపడుతుంది మరియు శరీర అవయవాల పనితీరును సరిగ్గా ఉంచుతుంది. నీరు తక్కువ తీసుకోవడం  వల్ల డీహైడ్రేషన్,  కిడ్నీలో రాళ్లు, పొడి చర్మం, పొడి  కళ్ళు వంటి అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఎక్కువ నీరు తాగేస్తుంటారు. దీని వల్ల బోలెడు ఆరోగ్యమని అనుకుంటారు కానీ.. శరీరానికి ఇది చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా?  నీరు ఎక్కువగా తాగితే, దాని వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..  రోజుకు కచ్చితంగా ఇంత  నీరు త్రాగాలి అని నిర్ణయించడానికి ఎటువంటి సూత్రం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా రోజుకు మూడు నుండి మూడు లీటర్ల నీరు శరీరానికి అవసరం అవుతుంది. అది కూడా  వాతావరణం, వ్యాయామం, ఆహారం, మొత్తం ఆరోగ్యం, మహిళలు  గర్భంతో ఉండటం  లేదా మహిళలు పిల్లలకు పాలు ఇవ్వడం  వంటి పరిస్థితులపై శరీరానికి కావలసిన  నీటి పరిమాణం ఆదారపడి ఉంటుంది. కానీ నీరు అధికంగా తీసుకుంటే ఈ క్రింది అనర్థాలు కచ్చితంగా జరుగుతాయి.  నీరు ఎక్కువగా తాగుతుంటే  వాటర్ పాయిజనింగ్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల  మూత్రపిండాల పనితీరును బాగా పెంచుతుంది, దీని ఫలితంగా  శరీరంలోని ఎలక్ట్రోలైట్లు కరిగిపోతాయి. ఉదాహరణకు, సోడియం (ఉప్పు) కరిగించినట్లయితే, హైపోనాట్రేమియా డవలప్ అవుతుంది. శరీరంలో చాలా తక్కువ సోడియం ఉంటే  కణాల లోపల నీరు చేరుతుంది.  ఇది శరీరం  వాపుకు దారితీస్తుంది. హైపోనాట్రేమియా  లక్షణాలు ఎలా ఉంటాయంటే.. హైపోనాట్రేమియా ను ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఓవర్ హైడ్రేషన్ యొక్క లక్షణాలు ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టం. అయితే, ఎక్కువ సార్లు  మూత్రవిసర్జన చేయాల్సి రావడం దీనికి ఒక సంకేతం. వాటర్ పాయిజన్ జరిగితే శరీరంలో ఈ క్రింది లక్షణాలు కనబడతాయి. వికారం మరియు వాంతులు. మెదడుపై ఒత్తిడి పెరిగి దాని కారణంగా తలనొప్పి. గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి వంటి మానసిక స్థితిలో మార్పులు. కండరాల తిమ్మిరి. తరచుగా మూత్రవిసర్జన సమస్య. వాంతులు కావడం. మన శరీరంలో మూత్రపిండాలు  ఒక సమయంలో ఎంత నీటిని విసర్జించాలనే పరిమితి కలిగి ఉంటాయి.  దీని ప్రకారం గరిష్టంగా గంటకు 800 నుండి 1,000 ml మూత్రం విసర్జించాలి.   ఎక్కువ నీరు తాగడం ప్రారంభిస్తే, శరీరం నుండి అదనపు నీటిని తొలగించడం మూత్రపిండాలకు కష్టమవుతుంది, దీని కారణంగా  అపానవాయువు, వికారం వంటి  సమస్యలు ఎదురవుతాయి.                                                                               *నిశ్శబ్ద.

మూత్రంలో నురుగు ఎక్కువ  కనిపిస్తోందా? ఈ నిజాలు తెలుసుకోండి..!

అనారోగ్యాలను నిర్థారించడానికి మూత్ర పరీక్షలు కూడా చేస్తారు. కొందరికి మూత్రం చాలా పసుపు రంగులో వస్తుంది. మరికొందరికి లేత పసుపు రంగులో ఉంటుంది. ఇంకొందరికి కేవలం నీరు ఎలా ఉంటుందో అలా మూత్రం వస్తుంది.  అయితే కొందరు మూత్రంలో నురుగు గమనిస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు కనిపించడం.. మూత్ర విసర్జన చేసిన కొన్ని సెకెన్లలోపు ఆ నురుగు క్లియర్ అయిపోతే అది ఆరోగ్యానికి ఏం చేయదు. కానీ మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రం లో నురుగు  అలాగే ఉంటున్నట్టేతే దాన్ని లైట్ తీసుకోకూడదని అంటున్నారు వైద్యులు. ఇంతకూ మూత్రంలో నురగ కనిపిస్తే కలిగే ప్రమాదం ఏంటి?  తెలుసుకుంటే.. మూత్రపిండాల వైఫల్యం.. నురుగుతో కూడిన మూత్రం   మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తుందని చెప్పలేం. కానీ ఇది ఖచ్చితంగా హెచ్చరిక లాంటిదేనని అంటున్నారు. కొన్నిసార్లు శరీరంలో తేమ తక్కువ ఉండి శరీరం డీహేడ్రేషన్ కు లోనవ్వడం లేదా అధిక ప్రోటీన్ ఆహారం కారణంగా మూత్రం  బలంగా ప్రవాహించడం వల్ల  తాత్కాలికంగా నురుగుగా మారుతుంది. అయితే ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, దానిని సీరియస్ గా  పరిగణించాలి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువకాలం నురుగుతో కూడిన మూత్రం మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటానికి సంకేతం కావచ్చని అంటున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ ప్రారంభ లక్షణాలు.. కిడ్నీలు ఫెయిల్ కావడానికి ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్ళు,  ముఖం వాపు, అలసట,  బలహీనత, ఆకలి లేకపోవడం, ముదురు రంగులో మూత్రం ఉండటం  లేదా దుర్వాసనతో కూడిన మూత్రం విసర్జించడం.  శ్వాస ఆడకపోవడం, చర్మం దురద, వాంతులు లేదా వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రంలో నురుగు ఉంటే ఈ వ్యాధులు కూడా ఉండవచ్చు.. నురుగు మూత్రం తరచుగా మూత్రపిండాల సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది.  అధిక నురుగు మధుమేహం,  అధిక రక్తపోటును  సూచిస్తుంది. గుండె సమస్యలు, గర్భం, ఒత్తిడి,  మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా అధిక నురుగు మూత్రానికి కారణమవుతాయి. తీవ్రమైన అనారోగ్యానికి మొదటి సంకేతం మూత్రంలోనే తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. నురుగు మూత్రం, మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం, బలమైన వాసన,  మంట లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రాత్రి భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం మంచిదేనా?

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది.  చాలామంది గ్రీన్ టీని ఉదయం సమయంలో తాగుతారు,  లేదా సాయంత్రం సమయంలో తాగుతారు. కానీ గ్రీన్ టీని రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత తాగినా చాలామంచి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు కొందరు.  అసలు గ్రీన్ టీ ని రాత్రి సమయంలో తాగవచ్చా?  రాత్రి సమయంలో తాగాలి అనుకుంటే ఎన్ని గంటలకు తాగాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏంటి? తెలుసుకుంటే.. రాత్రి సమయంలో గ్రీన్ టీ.. రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం గురించి ఒక సమాచారం చాలా వైరల్ అవుతోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కొంతమంది మళ్లీ ఏదైనా తినాలని అనుకుంటూ ఉంటారు.  ఏవో ఒక స్నాక్స్ లేదా పానీయాలు తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ రాత్రి సమయంలో బోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే పెద్ద పెద్ద ఆరోగ్య మార్పులు చేయకపోయినా.. చిన్న చిన్న మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు. స్వీట్ క్రేవింగ్స్.. రాత్రి సమయంలో బోజనం తర్వాత కొందరికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. డిన్నర్ చేసిన తర్వాత  తీపిగా ఉన్న పదార్థాలు ఏమైనా తినాలని అనుకుంటారు. ఇందుకోసం ఇంట్లో చిరుతిళ్లు,  ఐస్ క్రీమ్ లాంటివి కూడా స్టాక్ పెట్టుకుని ఉంటారు. కానీ రాత్రి భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఈ స్వీట్ క్రేవింగ్స్ కు చెక్ పెడుతుంది.  భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఆ తరువాత మళ్లీ స్వీట్స్ ఏమీ తినాలని అనిపించకపోవడమే దీనికి కారణం. రిలాక్స్.. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం మానసికంగా రిలాక్స్ గా ఉంచుతుందట. ఇది పదే పదే ఫోన్ చూడటం లేదా స్క్రీన్ టైమ్ ను తగ్గించుకోవడానికి సహాయపడుతుందట. నిద్ర సమయానికి మానసికంగా రిలాక్సేషన్ ఇస్తుందని అంటున్నారు. తక్కువ భోజనం.. రాత్రి సమయంలో డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తాగే అలవాటు భోజనం తక్కువ తీసుకోవడానికి సహాయపడుతుందట. రాత్రి తేలిక పాటి బోజనం ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగాలనే కారణంతో భోజనం తక్కువ తీసుకోవడం జరుగుతుందట. రాత్రి గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి.. రాత్రి సమయంలో గ్రీన్ టీని రాత్రి భోజనం చేసిన  అరగంట తర్వాత తీసుకోవచ్చు. రాత్రి గ్రీన్ టీ తాగితే నష్టం.. రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల కొందరికి నిద్ర పట్టడంలో సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది రాత్రి భోజనం చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి సమయంలో 7 నుండి 8 గంటల మధ్య భోజనం ముగిస్తే 8నుండి 8.30 లోపు గ్రీన్ టీ తాగవచ్చు.  రాత్రి 10గంటలకు చక్కగా నిద్రపోవచ్చు. అలా కాకుండా రాత్రి బోజనం ఆలస్యంగా 10 గంటలకు లేదా అంతకంటే ఎక్కువ సమయంలో చేసి ఆ తర్వాత గ్రీన్ టీ తాగితే అది నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రక్తం క్లీన్ గా ఉంటే రోగాలన్నీ దూరమే.. రక్తాన్ని ఇలా శుద్ది చేసుకోండి..!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రతి అవయవానికి తగినంత మొత్తంలో స్వచ్ఛమైన రక్తం అందితేనే ఇది జరుగుతుంది. రక్త స్వచ్ఛత అంటే అది విష పదార్థాలు లేకుండా ఉండాలని అర్థం. ఆహారం విషయంలో చేసే తప్పులు  కాలక్రమేణా రక్తంలో అనేక విష పదార్థాలు పేరుకుపోవడానికి కారణమవుతాయి. దీని వలన అనేక అవయవాలు విషపూరితంగా మారుతాయి. సాధారణంగా జీర్ణవ్యవస్థ,  మూత్రపిండాలు,  కాలేయం వంటి అవయవాలు సహజంగా రక్తాన్ని నిరంతరం ఫిల్టర్ చేస్తాయి. అయితే రక్తంలో ఎక్కువ టాక్సిన్లు ఉంటే ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రక్తంలో టాక్సిన్లు తొలగించే పానీయాలు తీసుకోవడం ద్వారా రక్తాన్ని క్లీన్ గా ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. రక్తం క్లీన్ గా లేకపోతే... రక్త నాణ్యత సరిగా లేకపోవడం వల్ల కాలేయం సరిగా పనిచేయదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మ ఇన్ఫెక్షన్లు, ఎప్పుడూ  మొటిమలు, దద్దుర్లు,  చికాకు, తరచుగా అలసట,  ముఖంపై మెరుపు లేకపోవడం మొదలైనవన్నీ  రక్తం శుభ్రంగా లేదని సంకేతాలు ఇస్తాయి. రక్తం శుద్ది చేసుకోవాలంటే.. ఎక్కువ నీరు త్రాగే అలవాటు శరీరాన్ని డిటాక్స్  చేయడంలో,  రక్తంలోని మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కాలేయం,  మూత్రపిండాల పనితీరు కూడా సక్రమంగా ఉంటుంది. ఈ అవయవాలు రక్తాన్ని శుద్ధి చేయడం,  రక్తంలో మలినాలను తొలగించడం వంటి పనులు చేయడంలో సహాయపడతాయి. నేషనల్ కిడ్నీ అసోసియేషన్ ప్రకారం  ప్రతిరోజూ 6 కప్పుల మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి తగినంత నీరు త్రాగాలి. నిమ్మరసం.. నిమ్మరసం  రక్తాన్ని,  జీర్ణవ్యవస్థను  రెండింటినీ శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా ఆమ్లంగా ఉంటుంది, ఇది pH స్థాయిలను తగ్గించడానికి,  రక్తం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి మలినాలను బయటకు పంపడానికి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో  తాజా నిమ్మరసం కలిపి  త్రాగాలి. ఇది  రక్తాన్ని శుభ్రంగా ఉంచడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు.. పసుపు దాని శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది  రక్తాన్ని శుద్ధి చేయడంలో,  వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. పసుపులో లభించే కర్కుమిన్ అనే సమ్మేళనం వాపు,  ఇన్ఫెక్షన్ ప్రమాదాల నుండి రక్షించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, ఒక కప్పు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు పొడి కలిపి త్రాగాలి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  శరీరం నుండి విషాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

చలిగా ఉందని టీ తెగ తాగేస్తున్నారా? జర జాగ్రత్త..!

వేసవి కాలంలో చల్లని పదార్థాలు, చలి కాలంలో వెచ్చని ఆహారాలు తీసుకోవాలని అనుకోవడం చాలా సాధారణం. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే వేడివేడి టీ తాగందే చాలామందికి తెల్లవారదు కూడా.  లేవగానే ఒక కప్పుతో మొదలు పెట్టి,  పూటకు ఒకసారి టీ తాగడమే కాకుండా.. పని చురుగ్గా జరగడం కోసం శరీరానికి ఉత్సాహం తెచ్చుకోవడానికి పదే పదే టీ తాగుతూ ఉంటారు. అయితే ఏదైనా సరే.. తీసుకునే దాన్ని బట్టి ఔషధంగానూ పనిచేస్తుంది,  విషంగానూ పనిచేస్తుంది.   ప్రతి రోజూ ఎన్ని కప్పుల టీ తాగడం ఆరోగ్యానికి మంచిది.  ఎన్ని కప్పులు తాగడం హానికరంగా పరిగణించబడుతుంది. తెలుసుకుంటే.. శీతాకాలంలో ఒక కప్పు వేడి టీ శరీరం,  మనస్సు రెండింటినీ ప్రశాంతపరుస్తుంది. టీ  వెచ్చదనం చేతులకు ఉపశమనం కలిగిస్తే.. దాని నుండి వచ్చే ఆవిరి మొత్తం వాతావరణాన్ని హాయిగా చేస్తుంది. చలి రోజులలో చాలా మంది రోజంతా లెక్కపెట్టనట్టు టీ తాగడానికి ఇదే కారణం.  అది వారి రోజువారీ అలవాటుగా మారుతుంది. మితంగా  టీ తాగడం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ ఎక్కువగా టీ తాగితే కొన్ని నష్టాలు కూడా  కలిగిస్తుంది. ఎక్కువ టీ తాగడం వల్ల కలిగే నష్టాలేంటి? టీ తాగితే కలిగే ప్రయోజనాలు,  నష్టాలేంటి? టీ ప్రయోజనాలు.. సరైన మొత్తంలో టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని పరిశోధనలు క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్,  టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని సూచిస్తున్నాయి. అయితే ఇది టీ రకం,  తీసుకునే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. టీలోని ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని అంటున్నారు. టీలోని కెఫిన్,  ఎల్-థియనిన్ కాంబినేషన్ మనస్సును ప్రశాంతపరుస్తుంది,  దృష్టిని మెరుగుపరుస్తుంది, కాఫీ కలిగించే ఆందోళనను నివారిస్తుంది. అల్లం లేదా పుదీనా వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో,  శరీర సహజ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జలుబు  ఫ్లూ సీజన్‌లో  రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి. టీ తాగితే నష్టాలు.. అధికంగా టీ తాగడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కెఫిన్ ఉన్న టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. టీలోని టానిన్లు ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది రక్తహీనతతో బాధపడేవారికి లేదా శాఖాహార ఆహారం తీసుకునేవారికి చాలా సమస్యగా  ఉంటుంది. రోజుకు 400 mg కెఫిన్ మించితే నిద్ర సమస్యలు, విశ్రాంతి లేకపోవడం,  హృదయ స్పందన రేటు పెరుగుదలకు దారితీస్తుంది. ఖాళీ కడుపుతో స్ట్రాంగ్  టీ తాగడం వల్ల వికారం, ఆమ్లత్వం లేదా తలతిరుగడం వంటివి జరుగుతాయి.  ఎక్కువకాలం  టీని ఎక్కువగా తాగడం వల్ల దంతాలు మరకలు పడతాయి.  కెఫిన్ వ్యసనానికి దారితీస్తుంది. రోజుకు ఎంత తాగితే మేలు.. ఎన్ని కప్పుల టీ తాగడం హాని కలిగిస్తుంది అనే విషయంలో చాలా మంది గందరగోళ పడుతుంటారు.  సాధారణంగా రోజుకు 3 నుండి 4 కప్పుల టీ తాగడం చాలా మందికి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.  కెఫిన్‌కు ఎక్కువ సెన్సిటివ్ గా ఉండేవారు లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులతో బాధపడేవారు టీ తీసుకోవడం పరిమితం చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.  రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వామ్మో.. ఈ మూడు అలవాట్లు మానకపోతే చిత్తవైకల్యం తప్పదట..!

ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర వణుకు వంటి సమస్యలు వచ్చేవి. పెద్ద వయసులో ఇవి సాధారణం అని భావించేవారు. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో చిత్తవైకల్యం,  పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఊహించకుండా వచ్చేస్తున్నాయి.  అందులోనూ వయసుతో సంబందం లేకుండా చాలామంది ఈ సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ రెండు వ్యాధులు  మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. జన్యుశాస్త్రంతో పాటు,  జీవనశైలి కూడా ఈ వ్యాధులకు దోహదం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా. చిత్త వైకల్యం,  పార్కిన్సన్స్ వంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా మూడు అలవాట్లు  పొరపాటున కంటిన్యూ  చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. నిద్ర.. శారీరక అలసటకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు గ్లింఫాటిక్ వ్యవస్థ ద్వారా టాక్సిన్స్ తొలగిస్తుంది. వీటిలో అమిలాయిడ్-బీటా ప్రోటీన్ ఉంటుంది. ఇది అల్జీమర్స్,  చిత్తవైకల్యంతో నేరుగా కనెక్షన్ కలిగి ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తుల మెదడులో హానికరమైన ప్రోటీన్లు పేరుకుపోతాయి. ఇవి మెదడు కణాలను నాశనం చేస్తాయి. రాత్రి నిద్ర ఆరోగ్యకరంగా ఉండాలంటే  ప్రతి రాత్రి ఒకే సమయంలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి.   పడుకునే 1-2 గంటల ముందు  మొబైల్ ఫోన్ వాడటం మానేయాలి. అల్పాహారం.. అల్పాహారం మన మెదడుకు ఇంధనంగా పనిచేస్తుంది. రాత్రంతా ఆహారం లేకుండా శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది.  దీని  తర్వాత మెదడు సరిగ్గా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. అందువల్ల, అల్పాహారం దాటవేసే వ్యక్తులకు పోషకాలు లోపిస్తాయి. ఇది మెదడు క్షీణత లేదా మెదడు కుంచించుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది చిత్తవైకల్యం ప్రారంభానికి మూలం అయ్యే అవకాశం కలిగి ఉంటుంది. అందువల్ల అల్పాహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, గింజలు,  తాజా పండ్లను చేర్చడం ముఖ్యం. ఇవి మెదడు కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. వ్యాయామం.. శరీరంలోని బద్ధకం మనస్సులో బద్ధకాన్ని కలిగిస్తుంది. వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మెదడుకు తగినంత ఆక్సిజన్,  పోషకాలను అందిస్తుంది. అయితే వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం,  అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇవి పార్కిన్సన్స్,  చిత్తవైకల్యానికి రెండు ప్రధాన ప్రమాద కారకాలు. శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల మెదడులో డోపమైన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది పార్కిన్సన్స్‌కు ప్రధాన కారణం. అందువల్ల ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు చురుకైన నడక, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామం చేయాలి.                            *రూపశ్రీ.

40ఏళ్ల లోపే మనుషుల్ని క్యాన్సర్ రోగులుగా మార్చే అలవాట్లు ఇవి.. మీకు ఉన్నాయేమో చెక్ చేస్కోండి..!

క్యాన్సర్ ప్రపంచాన్ని కబళిస్తున్న జబ్బు. పూర్తీగా చెయ్యి దాటిన దశలో బయటపడటం అనే కారణం వల్ల క్యాన్సర్ అంటే ఇక మరణమే అనే అభిప్రాయం ఏర్పడింది.  క్యాన్సర్ కు వైద్యం ఉన్నా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది.  సింపుల్ గా చెప్పాలంటే.. క్యాన్సర్ ఒక మనిషి  శరీరాన్ని లోపలే విచ్చిన్నం చేయడమే కాకుండా.. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా కూడా చితికిపోయేలా చేస్తుంది. నేటికాలంలో క్యాన్సర్ నిపుణులు కొన్ని ఆందోళనకరమైన మార్పులు గమనిస్తున్నారు. క్యాన్సర్ అంటే పెద్దవారిలో బయటపడేది అనుకునేవారు. కానీ నేటికాలంలో యువతలో కూడా క్యాన్సర్ బయటపడటం ఆందోళనగా మారుతోంది. కొంతమంది 20 లేదా 30 ఏళ్ల లోపు క్యాన్సర్ రోగులుగా మారుతున్నారు. రొమ్ము క్యాన్సర్ నుండి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వరకు అన్ని రకాల క్యాన్సర్‌లలో ఈ మార్పు కనిపిస్తోంది. శరీరాన్ని చాలా సైలెంట్ గా క్యాన్సర్ బారిన పడేలా చేసే 7 అలవాట్లు ఉన్నాయి. ఈ 7లో కూడా 3 పనులు చేసిన తర్వాత ప్రజలు చాలా గ్రేట్ గా ఫీలవుతూ ఉంటారు. అవేంటో అవి శరీరాన్ని క్యాన్సర్ బారిన పడేలా ఎందుకు చేస్తాయో.. తెలుసుకుంటే..   ప్రజలు మూడు పనుల విషయంలో చాలా గ్రేట్ ఫీలవుతారు.  పైగా వాటిని మార్చుకోవాలని కూడా అనుకోరు.  కానీ క్రమంగా అవి కణాలను,  హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఉదాహరణకు.. గంటల తరబడి కూర్చోవడం వల్ల  తాము చాలా పని చేస్తున్నామని, చాలా భాద్యతగా ఉంటున్నామని అనుకుంటారు. ఇది విజయానికి  మంచిదే కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా నష్టాలు కలిగిస్తుందని అంటున్నారు. అదేవిధంగా.. నిద్రించడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల  తగినంత నిద్రపోని వారు అనేకమంది ఉన్నారు. కొంతమంది ఎక్కువగా మద్యం సేవించిన తర్వాత తమ సామర్థ్యం బాగా పెరిగిందని తమను తాము గొప్పగా చెప్పుకుంటారు. ఆహారం.. నేటికాలంలో ఆహారపు అలవాట్లు చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయి. ప్యాక్ చేసిన స్నాక్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  తక్కువ ఫైబర్ భోజనం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ప్రేగులలోని బ్యాక్టీరియా సంఖ్యను ప్రభావితం చేస్తుంది. ఇది పెద్దప్రేగు,  గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. యాంటీబయాటిక్ ఎక్కువ వాడటం కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. పొల్యూషన్.. పర్యావరణ,  కాలుష్య కారకాలు క్యాన్సర్‌కు ప్రధాన కారణం. చుట్టూ ఉన్న కలుషితమైన గాలి,  ఇంటి లోపల,  వెలుపల గాలిని ప్రమాదకరంగా మారుస్తోంది. PM2.5,  వాయు కాలుష్యం నుండి వచ్చే టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశించి వాపుకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.  DNA ను దెబ్బతీస్తాయి. ఇది ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. జన్యువులు.. చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే వ్యక్తులు జన్యు కారణాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం వలన BRCA వంటి  సమస్యలు  సంభవించవచ్చు. అనారోగ్యకరమైన వాతావరణంలో జీవించడం దీని ప్రమాదం పెరుగుతుంది. పరీక్షలు.. యువతలో చాలామంది తమకు ఎదురయ్యే  ఆరోగ్య సమస్యలను లైట్ తీసుకుంటారు. మాది చిన్న వయసు మాకేం జబ్బులు వస్తాయి అని అనుకుంటారు. ఈ వయసులో క్యాన్సర్ ఎలా వస్తుందనే ఆలోచన యువతలో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాణాంతక వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది.  చికిత్స కష్టమవుతుంది.  దీర్ఘకాలిక నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, మలద్వారం నుండి రక్తస్రావం, ఎప్పుడూ  దగ్గు రావడం,  రొమ్ములో ముద్దగా ఉండటం,  మూత్ర విసర్జన అలవాట్లలో మార్పు లేదా నోటిలో పూతలు ఎక్కువ కాలం ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.                         *రూపశ్రీ.

బ్రాడీకార్డియా.. ఈ వ్యాధి గురించి తెలుసా?

నేటి కాలంలో మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి పెద్ద శత్రువులుగా మారినవి జబ్బులే.  కొత్త కొత్త ఆరోగ్య సమస్యలన్నీ బయటపడుతూ ఉంటాయి.  మనిషి ప్రాణాన్ని ప్రమాదంలో పడేసే లిస్ట్ లో బ్రాడీకార్డియా కూడా ఒకటి. ఇది గుండెకు సంబంధించిన జబ్బు. ఈ సమస్య తెలుసుకున్నప్పుడు దీన్ని సులువుగానే పరిష్కరించుకోవచ్చు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు అంటున్నారు. అసలు బ్రాడీకార్డియా అంటే ఏంటి? దీన్ని లక్షణాలు, కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. బ్రాడీకార్డియా.. హృదయ స్పందన మందగించినప్పుడు దానిని బ్రాడీకార్డియా అంటారు. ఈ పరిస్థితి చాలా తీవ్రమైనది,  ప్రాణాంతకమైనదిగా కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని నిర్గక్ష్యం చేయకూడదు. నెమ్మదిగా హృదయ స్పందనను గమనించాలి.  ఒక నిమిషం వ్యవధిలో  హృదయ స్పందనలను లెక్కించాలి. బ్రాడీకార్డియా ఎలా నిర్ణయిస్తారు.. గుండె సాధారణంగా నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. కానీ  గుండె నిమిషానికి 60 సార్లు కంటే తక్కువ కొట్టుకుంటే బ్రాడీకార్డియా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు. బ్రాడీకార్డియా ఉంటే ఏం జరుగుతుంది.. SA నోడ్ అనేది గుండెకు ఉండే  సహజ పేస్‌మేకర్, ఇది గుండె కొట్టుకునేలా క్రమం తప్పకుండా విద్యుత్ సంకేతాలను పంపుతుంది. బ్రాడీకార్డియాలో ఈ సంకేతాలు బలహీనంగా లేదా ఆలస్యంగా ఉంటాయి. దీనివల్ల గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది . ఇది రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది, శరీరానికి,  ఇతర అవయవాలకు తగినంత ఆక్సిజన్ డెలివరీని నిరోధిస్తుంది. హృదయ స్పందన నెమ్మదిగా ఉంటే ఏం  జరుగుతుందంటే..  హృదయ స్పందన నెమ్మదిగా ఉండటం వల్ల  శరీరం,  మెదడుకు తగినంత రక్తం,  ఆక్సిజన్ చేరకుండా ఆటంకం కలుగుతుంది. ఇది అలసట, తలతిరగడం, తలతిరగడం, శ్వాస ఆడకపోవడం, గందరగోళం,  మూర్ఛపోవడానికి కూడా కారణమవుతుంది. చాలా ఫిట్‌గా ఉన్న వ్యక్తులలో కూడా హదయ స్పందన నెమ్మదిగా ఉండే అవకాశం ఉంటుంది. హృదయ స్పందన నెమ్మదిగా ఉండటంతో పాటు ఇతర  కారణాలు  బ్రాడీకార్డియాను నిర్ధారిస్తాయి. ఇతర కారణాలు.. వృద్ధాప్యం దీర్ఘకాలిక గుండె జబ్బులు గుండె  విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లడం కొన్ని మందులు తీసుకోవడం డయాబెటిస్, అధిక రక్తపోటు,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత నిర్ధారణ,  చికిత్స.. బ్రాడీకార్డియాను సాధారణంగా ECG ద్వారా నిర్ధారణ చేస్తారు.  కొన్నిసార్లు హోల్టర్ మానిటర్‌ను సాధారణ హృదయ స్పందనను రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. చికిత్స పరిస్థితి  తీవ్రత,  కారణాన్ని బట్టి ఉంటుంది. తేలికపాటి కేసులకు మందులు,  జీవనశైలి మార్పులతో చికిత్స చేయవచ్చు. అయితే తీవ్రమైన కేసులకు పేస్‌మేకర్ అవసరం కావచ్చు. లీడ్ లెస్ పేస్ మేకర్లు.. సాంప్రదాయ పేస్‌మేకర్లు  ప్రభావవంతంగా ఉండేవి, కానీ వాటి వైర్లు సమస్యల ప్రమాదాన్ని పెంచేవి.. ఆ కారణంగా ఆధునిక లీడ్‌లెస్ పేస్‌మేకర్లు కనుగొన్నారు. ఇవి తక్కువ ఇన్వాసివ్,  వేగంగా కోలుకోవడానికి వీలు కల్పిస్తాయి. పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ తర్వాత చాలా మంది పూర్తిగా సాధారణ జీవితాన్ని గడుపుతారు.                      *రూపశ్రీ.

వారెవ్వా మందారం టీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.

రేగు పళ్లు అతిగా తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి..!

సీజన్ ను బట్టి లభించే పండ్లు చాలా ఉంటాయి.  అలాంటి వాటిలో రేగు పళ్లు చాలా ముఖ్యమైనవి.  అయితే రేగు పళ్లను  ఎవరు తిన్నా ఏం పర్వాలేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కొందరు వ్యక్తులు  రేగు పళ్లను తినకూడదట.  అసలు రేగు పళ్లను ఎవరు తినకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? రేగు పళ్లను తినడం వల్ల ఎవరికి సమస్యలు ఉంటాయి? వివరంగా తెలుసుకుంటే.. సీజన్ ను బట్టి వివిధ రకాల పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి.  ఆరోగ్యం బాగుండాటంటే సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవడం మంచిదని అంటుంటారు వైద్యులు, పెద్దలు. శీతాకాలంలో లభించేవి రేగు పళ్లు. చాలామంది రేగుపళ్లను చాలా ఉత్సాహంగా తింటారు.  ఇవన్నీ చిన్నతనంతో ముడిపడిన ఆనందాలు. కొంతమందికి మాత్రం రేగు పళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. ఎవరు తినకూడదంటే.. మధుమేహం ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండాలి. బాగా పండిన రేగు పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి. కేవలం చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటమే కాకుండా వాటిలో కార్బోహేడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.  ఈ కారణంగా రేగు పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రేగు పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  అప్పటికే గ్యాస్,  ఎసిడిటీ,  అజీర్తి మొదలైన సమస్యలు ఉన్నవారు రేగు పండ్లను తింటే సమస్య మరింత పెరుగుతుంది. గర్బిణీ స్త్రీలు రేగు పండ్లకు దూరంగా ఉండాలి.   రేగు పండ్లు తినడం వల్ల వారికి కడుపులో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అలాగే మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కొంతమందికి రేగు పండ్లు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.  దద్దుర్లు,  దురద వంటి సమస్యలు వస్తాయి.  అలర్జీ సమస్యలు ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండటం మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...