రాజ్యసభలో ఉల్లి లొల్లి
posted on Aug 19, 2013 @ 8:10PM
మన రాష్ట్రంలో ప్రజలను భయపెడుతున్న నిత్యవసర వస్తువుల మంట రాజ్యసభను తాకింది. సోమవారం సభ ప్రారంభం కాగానే మన రాష్ట్రంలో మండిపోతున్న ఉల్లిధర పై సభలో గందళగోలం నెలకొంది. దాంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభం కాగానే మాజీ రాజ్య సభ్యులు దిలీప్ సింగ్ జుదేవ్, ఎస్ ఎం లాల్ జాన్ బాషాల మృతి, ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో మరణించిన నౌకా సిబ్బంది మృతి పట్ల చైర్మన్ హమీద్ అన్సారీ సంతాపం తెలిపారు.
తరువాత మరోసారి రాజ్యసభలో నిరసలు మొదలయ్యాయి. వామపక్షాల సభ్యులు లేచి, ఉల్లిపాయల ధరలు మండి పోతున్నాయని ప్రభుత్వం చొరవ తీసుకొని ధరలను నియంత్రించాలని కోరారు. సభాపతి ఎన్నిసార్లు వారించిన సభ్యులు వినకపోవటంతో సభను మరోసారి వాయిదా వేశారు. ఆ తరువాత కూడా సభలో పరిస్థితి ఏ మాత్రం మారకపోవటంతో మరోసారి వాయిదా వేశారు.