అయ్యో!... రాముడిని కాదు.. గోవిల్‌ని!
posted on Oct 2, 2022 @ 10:25AM
మనదేశంలో భక్తికి, వీరాభిమానానికి అంతే ఉండదు. అది పెద్ద తెరమీద చూసినా, బుల్లి తెరమీద చూసినా..రాముడు రాముడే, కృష్ణడు కృష్ణడే...అది ఎన్టీ రామారావయినా.. అరుణ్ గోవిల్ అయినా! మనసులో ముద్రపడితే బయట పంచె లాల్చీతో ఎన్టీ రామారావు కనప డినా, ప్యాంట్ షర్టుతో గోవిల్ కనిపించినా మానవా వతారాల్లో కళ్లముందు కనపడు తున్నార నుకుంటారేగానీ వాళ్లని నటులు గా మాత్రం అనుకోరు. అదీ వీరా భిమానానికి రుజువు. అది విప రీత భక్తి అంటే.. అదే గొప్ప నటు డికి అరుదయిన గౌరవం అంటే.
ఎన్టీరామారావు పూర్వం ఓ సిని మాలో కృష్ణుడు వేషం వేసి సెట్ లోంచి బయటికి రాగానే నిజం గానే దేవుడు నడిచి వస్తున్నా డని సెట్ బయట ఉన్న వాళ్లతో కొందరు అమాంతం పొర్లు దండాలు పెట్టేరని విన్నాం. సరిగ్గ అలాంటిదే అరుణ్ గోవిల్‌కీ జరిగిం ది. ఓ పెద్దావిడ రాముడు ఇలా మోడ్రస్ డ్రస్‌లో కనిపించడంతో అమాంతం టీవీ రాముడు గుర్తొచ్చి మోకరిల్లి దండం పెట్టింది! ఇంత కంటే వీరాభిమానులు ఎక్కడన్నా ఉంటారా? అభిమానానికి భాషకీ సంబంధం లేదు. ఎన్టీఆర్ పాత సినిమాలు 80ల్లో చూసిన ఉత్తరాది రాజకీయనాయకులు ఈయనేనా ఆయనా అన్నారట!
బుల్లి తెరపై రామానంద్ సాగర్ రామాయణ వచ్చి దదాపు 35 ఏళ్లయింది. కానీ దాని ప్రభావం ఇప్పటికీ జనాల్లో ఉంది. రాముడు అంటే గోవిల్ అనే భావన ఇప్పటికీ ఉత్తరాదిన బాగా ఉంది. ఆయన ఆ తర్వాత పెద్దగా సీరియల్స్‌లో కనపడక పోయినా అంతకు ముందు వేసినవి చూసినా ఆయన్ని మాత్రం రాముడనే అనుకుంటారు. కొండకచో అలానే పిలుస్తున్నారట! రామాయణం ప్రభావం ఆ స్థాయిలో ఉంది. ఇప్పటికీ! నిజంగానే అంత అద్భుతంగ తీశారు, నటులు అంతే అద్భుతంగా చేశారు. రాముడు, సీతతో పాటు ప్రేక్షకులు ప్రయాణం చేశారనొచ్చు. అంతగా ఆకట్టుకుంది ఆ సీరియల్. అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చికలియా సీతగా, సునీల్ లహ్రి లక్ష్మణుడిగా చేశారు. 1987-88 కాలంలో వచ్చిన సీరియల్ ఆ తర్వాత లాక్‌డౌన్ సమయంలో 2020లో తిరిగి ప్రసారమయినపుడు అంతే స్థాయిలో అందరి ఆదరణా పొందింది.
ఆయన కుటుంబ సమేతంగా వెళుతూండగా నలుగురు వారిని చూసి అడుగో రాముడు అన్నారు. అంతే వెంటనే వెళ్లి ఓ మహిళ అతని పాదాల దగ్గర మోకరిల్లి నమస్కరించింది. మరుక్షణం ఆమె భర్త కూడా అదే భక్తిపూర్వకంగా నమస్కరించాడు! అరుణ్ , అతని భార్యా ఎంత వారిస్తున్నా వారు పాదాభివందనాన్ని మానలేదు. ఆ తర్వాత రాముడి పాత్ర తనకు ఆ సీరియల్లో రావడం కేవలం అదృష్టమని, అది అందరి మనసును ఆకట్టుకోవడం నన్ను అభిమానించడమూ జీవితంలో మరువనని గోవిల్ అన్నా డు. అంతకుముందు అతను సినిమాల్లోనూ చేశాడు. కానీ రామాయణం దెబ్బకి ఆ సినిమా ఛాన్సులు పోయాయిట. రాజకీ యాల్లోకి గత ఏడాడే వచ్చాడు. ఇంత పాప్యులర్ నటుడిని కమలనాథులే వల వేసి పట్టారు. జై శ్రీరామ్ అనేది కేవలం నినాదం కాదని అది మన సంస్కృతికి చిహ్నమన్నాడు గోవిల్.