నర్సులు కావలెను.. అనుభవం అవసరం లేదు.. వసతి జీతం ఫ్రీ..
posted on Apr 5, 2021 @ 10:44AM
నర్సులు కావలెను. అనుభవం లేకున్నా పరవాలేదు.. అవకాశం ఇస్తాం.. ఏంటి...? అనుభవం లేకున్నా అవకాశం ఏంటని అనుకుంటున్నారా. అవసరం అలాంటిది మరి . ఇది నా మాట కాదు. ప్రయివేట్ ఆసుపత్రుల ప్రకటనలు. కరోనా సెకండ్ వేవ్ పెరగడంతో.. ఆసుపత్రుల్లో కిక్కిరుసుకుపోతున్నారు జనాలు. వారికి సేవలు అందించడానికి. నర్సులకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులు వందలోపు, కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాలైతే 200 నుంచి 500 మంది దాకా నియమించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటికే 200 మంది నర్సులను రిక్రూట్ చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అనుభవం లేకున్నా పర్వాలేదు జాబ్ లోకి తీసుకుంటాం అంటున్నారు. అనుభవం ఉంటే జీతం మరింత ఎక్కువే ఇస్తాం. వసతి సదుపాయాలూ కల్పిస్తాం. వచ్చి చేరండి’ అని సోషల్ మీడియాలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆస్పత్రుల్లోని నోటీసు బోర్డుల్లో పెడుతున్నారు. వృత్తిలో ఏడాది నుంచి ఐదేళ్ల అనుభవమున్నవారు, నర్సింగ్ స్కూళ్లలో తాజాగా కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.
గత ఏడాది మార్చి నుంచి కరోనా వ్యాప్తి ఉండటంతో నర్సులో కొంతమంది వృత్తిని మానేసి వెళ్లిపోయారు. ఇంకొందరు కుటుంబసభ్యుల ఒత్తిడితో మానుకున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసినవారూ ఉంటున్నారు. నర్సులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అరబ్ దేశాల్లో నర్సులకు రూ.లక్షకు పైగా జీతాలు ఇస్తున్నారు. ఓటీ చేస్తే జీతం అదనం. మనవద్ద మాత్రం గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే ఇస్తుండటంతో కోర్సు పూర్తి చేసినవారిలో చాలామంది సౌదీ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా సెకండ్ వేవ్ కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్నారు. దీంతో కరోనా వార్డుల్లోని పడకలు ఫుల్ అయ్యాయి. మరింత మంది రోగులకు వైద్యసేవలు అందించేందుకు పడకల సంఖ్యను పెంచుకుంటున్నారు. రోగులకు సేవలు అందించే వాళ్ళు కేకపోవడం తో ఆసుపత్రుల యాజమాన్యం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాత్కాలిక పద్ధతిలో సాధారణ నర్సులకు నెలకు రూ. 14 వేల నుంచి 15 వేలు, ఐసీయూలో అనుభవమున్న వారికి రూ. 16 వేలనుంచి రూ.20 వేల దాకా ఇవ్వనున్నారు.
విదేశాల్లో కూడా నర్సులకు డిమాండ్..
విదేశాల్లో నర్సులకు చాలా డిమాండ్ ఉండనే చెప్పాలి. అక్కడ వారికి రూ.లక్ష చొప్పున జీతం ఇస్తారు. రెండేళ్లకు మించి అనుభవం ఉంటే రూ.లక్షకు మించి ఇస్తున్నారు. మన దగ్గర రూ.20వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో చాల మంది విదేశాలల పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం వల్ల కొంత మంది అక్కడ చేరుతున్నారు. ప్రతి ఏటా గ్రేటర్ పరిధిలో ఉన్న 40 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు. ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలోని ఒక ప్రభుత్వ కాలేజీ కలుపుకొని ఏటా 1500 మంది నర్సులు శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు. ఇందులో 800 మంది నర్సులే వైద్య సేవలందించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చేరినవారిలో కొందరు జీతాలు సరిపోక ఉద్యోగాల నుంచి తప్పుకొని ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. దీంతో మొత్తంగా ప్రస్తుతం ఇక్కడ నర్సులకు కొరత ఏర్పడింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడీయాట్రిక్స్ ప్రకారం ప్రతీ ఐదుగురు రోగులకు ఓ నర్సు ఉండాలి