విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రాయినికి తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది.

అలాగే రాష్ట్రంలోని మరో రెండు విమానాశ్రయాల పేర్లను కూడా మార్చాలని కేంద్రాన్ని కోరింది. కర్నూలు విమానాశ్రాయనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును, తిరుపతి విమానాశ్రయానికి తిరుమలేశుడి పేరు పెట్టాలని భావిస్తున్నది.

ఈ మేరకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపింది. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే విమానాశ్రయాల పేర్లు మార్చాలని నిర్ణయించింది.