ఎన్టీఆర్ ఆశయాలను పురంధేశ్వరి మరిచారు
posted on Apr 10, 2011 9:28AM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై వ్యాఖ్యానించిన కాంగ్రెసు నాయకురాలు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు కె. ఎర్రన్నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీపై మాట్లాడే హక్కు పురంధేశ్వరికి లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ నడుస్తోందని, ఎన్టీ రామారావు ఆశయాలను మరిచిపోయి పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్నారని ఆయన అన్నారు. పురంధేశ్వరి కాంగ్రెసులో చేరి నాన్నగారి ఆశయాలకు తిలోదకాలిచ్చారని ఆయన విమర్శించారు. పురంధేశ్వరి మూడు పార్టీలు మారారని ఆయన అన్నారు. ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ కుట్ర చేసి నాదెండ్ల భాస్కరరావును ప్రయోగించిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కుట్రలకూ కుతంత్రాలకూ నిలయమని, అటువంటి పార్టీలో పురంధేశ్వరి ఉన్నారని ఆయన అన్నారు. మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.