అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు 

సంధ్య థియేటర్ ఘటనలో నిందితుడైన , నటుడు అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించనున్నట్లు రాంగోపాల్ పేట పోలీసులకు సమాచారమందింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఇన్ పేషంట్లకు ఇబ్బంది కలుగుతుందన్న కారణంగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ రాదల్చుకుంటే  తేదీ సమయం ఖరారు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.  పుష్ప 2 బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరు అయిన నేపథ్యంలో రేవతి చనిపోవడం ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేస్తూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యంతర బెయిల్ పై విడుదలైన    అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే