నూర్ జహాన్ ఆరోగ్యం విషమం
posted on Apr 15, 2023 @ 2:28PM
పాకిస్థాన్ కు చెందిన నూర్ జహాన్ అనే ఏనుగు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతుంది. కరాచీ జూపార్క్ లో ఉన్న ఈ ఏనుగు అక్కడి ఒక లోతైన గుంటలో పడిపోయింది. దీంతో దాని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గుంటలో పడిపోయిన ఏనుగును క్రేన్ సాయంతో వెలికి తీశారు. కానీ అప్పటి నుంచి నూర్ జహాన్ లేవలేకపోయింది. గ్లూకోజ్ బాటిల్ ను ఎక్కిస్తున్నారు. నూర్ జహాన్ అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. అది తన బాధను చెప్పుకోలేకపోతుంది. అప్పుడప్పుడు చెవులు విదిలిస్తుంది. నూర్ జహాన్ తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు. నూర్ జహాన్ లేవలేకపోతే మరణం సంభవించవచ్చని డాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఈ ఏనుగును వెలిలి తీయడానికి ఇంటర్ నేషనల్ వెల్పేర్ ఆర్గనైజేషన్ మద్దత్తు తీసుకుంటున్నారు. నూర్ జహాన్ ఆరోగ్యం మీద అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.