రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్..
posted on Oct 5, 2016 @ 4:18PM
ఇప్పటి వరకూ వైద్య రంగంలో.. ఫిజిజ్స్ కు సంబంధించి నోబెల్ బహుమతులు అందించగా ఇప్పుడు రసాయన శాస్త్రానికి సంబంధించి పలువురికి నోబెల్ దక్కింది. అతి సూక్ష్మ యంత్రాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు జీన్ పెర్రీ సావేజ్, సర్ జే ఫ్రేజర్ స్టొడార్ట్, బెర్నార్డ్ ఫెరింగాలు ఈ సారి నోబెల్‌ను గెలుచుకున్నారు. ఈ ముగ్గురూ మానవ శరీరంలోని పరమాణువు యంత్రాలను డిజైన్ చేశారు. ఆ పరమాణువులు చేసే సంశ్లేషణ అంశాన్ని కూడా వీళ్లు విశదీకరించారు. స్వీడన్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నోబెల్ కమిటీ ఈ ముగ్గురు శాస్త్రవేత్త పేర్లను వెల్లడించింది. దేహంలోని సూక్ష్మ యంత్రాలను రూపొందించిన ఈ ముగ్గురూ రసాయనిక శాస్త్రాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారని రాయల్ స్వీడిష్ అకాడమీ అభిప్రాయపడింది. కాగా జపాన్ కు చెందిన యోషినోరి ఒషుమికి వైద్యరంగంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. ఖగోళంలో రూపు మార్చుకుంటున్న పదార్థాలను అధ్యయనం చేసే ‘టోపాలజీ’ శాస్త్రవేత్తలయిన బ్రిటన్ త్రయం డేవిడ్ థౌలెస్, డంకెన్ హాల్దేన్, మైఖేల్ కోస్టెర్‌లిడ్జ్‌లకు నోబెల్ దక్కింది.