కరోనా కు వ్యాక్సిన్ అవసరమే రాదు... ఇవిగో ప్రూఫ్స్
posted on Jun 24, 2020 @ 10:38AM
కరోనా తో ప్రపపంచం అతలాకుతలం అవుతోంది. భారత్ లో ఐతే కరోనా కేసులు రోజుకు 15 వేలు పైగా నమోదవుతున్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులను, ఇటు పోలీస్ డిపార్ట్ మెంట్ ను కూడా కరోనా చుట్టేస్తోంది. ఇక సామాన్య జనం ఐతే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటలీ శాస్త్రవేత్తలు అందరికి ఊరటనిచ్చే చల్లని కబురు చెపుతున్నారు. స్వైన్ ఫ్లూ, ఎబోలా, సార్స్, మెర్స్ వైరస్‌లు మనపై దాడి చేసి కొంతకాలానికి వాటంతట అవే కనుమరుగయ్యాయి. ఆ వైరస్ ల దారిలోనే కరోనా కూడా చేరుతుందని వారు తెలిపారు. ప్రస్తుతానికి కరోనా వైరస్ పది ప్రధాన దేశాల్లో అత్యంత ప్రమాదకరంగా ఉంది. మిగిలిన దేశాల్లో మాత్రం కేసులు తగ్గుతున్నాయి. ఐతే భారత్, రష్యా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కరోనా తీవ్రంగా పెరుగుతున్నట్టు తాజా గా అందుతున్న లెక్కలను బట్టి తెలుస్తోంది. ఐతే దీని పై ఇండియా, ఇటలీలో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కరోనా వైరస్‌కి అసలు వ్యాక్సిన్ అవసరం రాకపోవచ్చని ఇటలీ కమ్యునికబుల్ డిసీజెస్ స్పెషలిస్ట్ మ్యాటియో బసెట్టి అంటున్నారు. అయన తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి, మార్చి తో పోల్చితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చాలా బలహీనపడిందని అంటున్నారు. వైరస్ వ్యాప్తి ఐతే జోరుగా ఉంది గానీ వైరస్ మాత్రం ఇదివరకటి అంత ప్రాణాంతకంగా లేదని చెప్తున్నారు.
మార్చి, ఏప్రిల్ కాలంలో కరోనా బాధితుల నుండి సేకరించిన శాంపిల్స్‌లో కరోనా చాలా తీవ్రంగా ఉన్నట్లు తేలింది. ఐతే ఇపుడు మాత్రం 80 నుంచి 90 ఏళ్ల వారు కూడా వెంటిలేటర్ సాయం లేకుండానే చికిత్స పొంది కరోనాను జయిస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే జులై లో కరోనా కేసులు గరిష్ఠానికి చేరతాయని అంచనా వేస్తున్నారు. తరువాత ఆగస్టు నుంచి కేసులు తగ్గడం మొదలవుతుందని.. సెప్టెంబర్ నాటికి ఇండియాలో కూడా కరోనా పూర్తిగా తగ్గిపోతుందని టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ చెపుతోంది. ఈ సంస్థ మన కేంద్ర ఆరోగ్య శాఖ ఇస్తున్న లెక్కలు, శాస్త్రవేత్తల అంచనాల్ని లెక్కలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారుచేసినట్లు తెలుస్తోంది. జులై 25 నాటికి భారత్ లో కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరతాయని ఈ రిపోర్ట్ సారాంశం.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొత్త కేసుల కంటే రికవరీ ఐన కేసులు బాగా పెరుగుతున్నాయి. భారత్ లో కూడా రికవరీ అవుతున్నవారి సంఖ్య రోజురోజుకూ మెల్లగా పెరుగుతోంది. ఏది ఏమైనా ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్పినట్లు వ్యాక్సిన్ తో పని లేకుండానే వైరస్ తగ్గిపోతే మానవాళికి అంతకంటే కావలసిందేముంది.