ఉపఎన్నికలు లేనట్టే ..
posted on Apr 15, 2013 @ 12:07PM
ఢిల్లీలోని ఎపిభవన్ లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ, కేంద్రమంత్రి పసబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, స్పీకర్ నిర్ణయాధికారాలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోలేదని, సాధారణంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తరువాత ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపుతారని, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది గడువుండగా శాసనసభ స్థానాలకు ఖాళీ ఏర్పడితే ఉప ఎన్నికలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006 - 2011 మధ్యకాలంలో 76 ఉపఎన్నికలు వచ్చాయని, మొత్తం 294 స్థానాల్లో మూడోవంతు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయని, పదేపదే ఉపఎన్నికలు రాకుండా అడ్డుకునే అధికారాలు ఎన్నికల సంఘానికి లేవనీ, దీనికి సంబంధించి ఏదైనా చట్టం కేంద్రం రూపొందించాలని తెలిపారు.