ఆధార్ ఉంటేనే.. ఊర్లోకి ఎంట్రీ..
posted on Mar 27, 2021 @ 4:08PM
ప్రయాణించాలంటే టికెట్ ఉండాలి. పెన్షన్ కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి. మన కులం ఏదో తెలియాలంటే కాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్, వీసా ఉండాలి.. అంతకంటే ముందు మనీ కూడా ఉండాలి.. కానీ తెలంగాణలో ఓ గ్రామంలోకి కొత్తవాళ్లు అడుగుపెట్టాలంటే కూడా తప్పకుండా ఆధార్ ఉండాల్సిందే.. ఆధార్ కార్డు లేకుంటే ఆ ఊరు కాదుకదా. గ్రామ పొలిమేర కూడా దాటలేరు. ఆ ఊరిలో ఎవరింటికి అయినా చుట్టాలు ఆధార్ లేకుంటే వస్తే.. తిరిగి వచ్చినా దారినే యూటర్న్ తీసుకోవాల్సిందే. అది ఐస్ క్రీమ్ అమ్మేవాడైన, కూరగాయలు అమ్మేవాడైన, కూలికి వచ్చినా వాడైనా సరే మూడు ఐడి కార్డు ఇచ్చి గ్రామంలోకి వెళ్ళాలి మళ్ళీ తిరిగివెళ్ళటప్పుడు ఐడి కార్డు తీసుకోవాలి. అదే ఆ గ్రామ శాసనం. గత పదేళ్లుగా ఈ కట్టుబాటును కొనసాగిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. ఏంటి.. ? నాకు తెలిసి అసలు అలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయా అని అనుకుంటున్నారా? ఉంటే ఎక్కడ ఉంది..? ఆ ఊరి పేరు ఏంటి? అని తెలుసుకోవాలనుకుంటున్నారా.. అసలు ఆ గ్రామస్తులు ఈ కట్టుబాట్లు ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే మీరే చదవండి.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పొతంగల్ గ్రామంలో 2,500 జనాభా ఉంది. పదేళ్ల క్రితం ఓ దొంగ బాబా ఒళ్లంతా వీభూతి, కాషాయం బట్టలు వేసుకుని ఊరిలో వచ్చాడు. గ్రామస్తులు వ్యవయంపై ఆదారపడి జీవించేవారు.. అయితే మధ్యాహ్నం గ్రామంలో ఇళ్లకు తాళాలు వేసి, పొలం పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వారిని గమనించి మాటలతో ఓ వ్యక్తిని నమ్మించాడు. బంగారాన్ని పూజ చేసి అంతకు అంత చేస్తానని నమ్మబలికాడు. దీంతో బాబా మాయమాటలు నమ్మిన ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకు వచ్చి బాబా చెప్పినట్టు చేసారు. ఆ దొంగ బాబా తన పని పూర్తి చేసుకుని అక్కడి నుండి బయటపడ్డాడు. అతడు తేరుకుని చూడగా బంగారం లేదు. ఆ బాబా లేడు. ఆ తర్వాత బాబా కోసం ఎక్కడ వేతికినా ఆచూకీ తెలియలేదు. ఆప్పటి నుంచి ఆ గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. తమ గ్రామంలోకి ఎవరు వచ్చిన ముందు గ్రామపంచాయితీ వద్ద వారి ఆధార్ కార్డు ఇచ్చినా తరువాతే గ్రామంలోకి రావాలి లేదంటే ఎంతటి వారైన తిరిగి పంపాలని కట్టుబాటు పెట్టుకున్నారు.
పెద్ద పొతంగల్ గ్రామంలోకి రాగానే ముందుగా పంచాయితీ కార్యలయం దగ్గర ఉన్న చెట్టు కింద మార్నింగ్ నుంచి నైట్ వరకు గ్రామస్తులతో పాటు పంచాయితీ వారు కూర్చొని ఉంటారు. కొత్త వ్యక్తి కనిపించగానే ఊరు, పేరు, ఎక్కడికోసం వచ్చాడు, ఎవరికోసం వచ్చాడు అని అన్నీ విషయాలు ఆరాతీసారు. ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఊళ్లో అడుగుపెట్టనిస్తారు. గ్రామంలోకి కూరగాయలు అమ్మడానికి వచ్చినా.. ఐస్ క్రింమ్ అమ్మేవారు వచ్చినా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐడి ఇచ్చి తిరిగి గ్రామంలో నుంచి వెళ్లే సమయంలో వారి ఐడీ వారు తిసుకోని వెళ్లాల్తారు. ఈ నిబంధన అమలు చేసినప్పటి నుంచి గ్రామంలో ఎలాంటి దొంగతనాలు, మోసాలు జరుగడం లేదని గ్రామాస్తులు చెబుతున్నారు.