బాబు బాటలో నితీష్
posted on Apr 25, 2023 @ 4:59PM
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) మంగళవారం భారత రాజకీయానువెక్కిరించే ధోరణిలో మాట్లాడారు.బీహార్ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను టార్గెట్ గా చేసుకుని ఆయన చేసిన వాఖ్యలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ యేతర పార్టీలను కూడగట్టి అధికారంలో తీసుకురావడానికి నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. చంద్ర బాబు కూడా 2019లో నితీష్ తరహా ప్రయత్నాలు చేసి భంగపడ్డారని పీకే గుర్తు చేశారు. అతను బీహార్ ప్రజల వెల్ఫేర్, డెవలప్ మెంట్ పట్టించుకోకుండా దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాననడం అవివేకమన్నారు. ఒక ఎంపీ కూడా లేని నితీష్ కుమార్ దేశ ప్రధాని ఎవరు కావాలో నిర్ణయిస్తున్నాడని పీకే ఎద్దేవా చేశారు.
బీహార్ కు చెందిన ఈ రాజకీయ వ్యూహకర్త బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్, డిఎమ్ కె , టీఎంసీ, బీఆర్ఎస్ తదితర పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. పీకే గతంలో గుజరాత్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ తరపున ప్రచారం చేశారు. 2012లో మోడీ విజయానికి పీకే దోహదపడ్డారు.అప్పటి నుంచే అతను పాపులర్ అయ్యారు. పీకే పూర్వాశ్రమంలో ఐక్యరాజ్య సమితిలో పని చేశారు. భారత్ లో పేరెన్నికగన్న ఎన్నికల వ్యూహకర్తలలో పీకే ముందువరసలో నిలిచారు. ప్రశాంత్ కిషోర్ అస్సాంకు చెందిన ఫిజీషియన్ ని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నారు.