మొరార్జీ రికార్డు సమం చేసిన విత్త మంత్రి..ఎందులో నంటే..?
posted on Feb 1, 2024 @ 2:21PM
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 10) 2024 మధ్యంతర బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. పాత పన్ను బకాయిల రద్దు మాత్రం ఒకింత ఊరట కలిగించినా పన్ను రేట్లను యథాతథంగా ఉంచడం, అలాగే ఆదాయపన్ను మినహాయింపు పెంపుపై వేతన జీవులు పెట్టుకున్న ఆశలను పట్టించుకోకపోవడం నిరాశ కలిగింది. అదే విధంగా పన్ను స్లాబుల విషయంలో కూడా ఎలాంటి మార్పూ చేయలేదు.
అయితే ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కావడంతో ఎటువంటి అంచనాలూ వద్దని నిర్మలా సీతారామన్ ముందు ప్రకటించడంతో ఈ బడ్జెట్ పై ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే ఈ మధ్యంత బడ్జెట్ గురించి చెప్పుకోవలసింది ఏమైనా ఉందంటే అతి విత్త మంత్రిగా బడ్జెట్ లు ప్రవశ పెట్టడంతో నిర్మలా సీతారామన్ సృష్టించిన రికార్డు ఒక్కటే. అవును మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మధ్యంతర బడ్జెట్ ల రికార్డును నిర్మలా సీతారామన్ సమం చేశారు.
ఔను 1959 1964 మధ్య కాలంలో మోరార్జీ దేశాయ్ విత్త మంత్రిగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్ లు, ఒక ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుత విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అలాగే ఆమె ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధంగా అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా కూడా రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 2020లో నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఏకంగా 2 గంటల 42 నిముషాలు ప్రసంగించారు.