హైకోర్టులో నిమ్మగడ్డ రిప్లై పిటీషన్ దాఖలు
posted on Apr 27, 2020 @ 1:12PM
ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ సి ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈసీ కౌంటర్ రిప్లై పిటిషన్ లో నిమ్మగడ్డ తెలిపిన కీలకవిషయాలు వెల్లడించారు. సెక్రటరీ విధులు కేవలం కమిషనర్ రోజు వారీ పనుల్లో సాయం చేయటానికి మాత్రమే పరిమితమని, ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యతగా తీసుకోవాల్సిన నిర్ణయమని ఆయన వివరించారు. ఎన్నికల సంఘంలోని న్యాయ విభాగం ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత నే తాను సంతకం చేసినట్టు చెప్పారు.
ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటిస్తూ నిర్వహించిన మీడియా సమావేశం ఒకరోజు ముందుగానే నిర్ణయించింది. ఎన్నికల కమిషనర్ కి తన విచక్షణ అధికరంతో వాయిదా వేసే అధికారం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలు అన్నింటినీ ఎన్నికల సంఘంలో ఉన్న ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదు, అనే మూడు అంశాలను రమేష్ కుమార్ రిప్లై పిటీషన్ లో పేర్కొన్నారు.