హర్యానా ప్రభుత్వానికి ఎన్‌జీటీ షాక్
posted on Sep 27, 2022 @ 5:40PM
చెత్తబుట్టలో పడేయాల్సిన చాక్లెట్ కవర్ బయటపడేసింది పింకీ, వాళ్లన్న సిగరెట్ పీక కిందపడేసేడు. అంతే వాళ్లమ్మ తిట్టింది, మామ్మగారు అలా పడేయకూడదన్నారు, పోనీలేద్దూ చిన్నపిల్లన్నారు నాన్న. కానీ హర్యానా ప్రభుత్వం చేసింది మరీ చాలా చెప్పలేనంత పెద్ద తప్పు గనక జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటీ) మొట్టికాయలతో పాటు భారీ జరిమానా విధించింది.
గురుగ్రామ్ డంపింగ్ యార్డును హర్యానా ప్రభుత్వం 2017లో ఒక చైనాకంపెనీకి నిర్వహణా బాధ్యతను అప్పగించింది. కానీ ఆ సంస్థ నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా చెత్తను కాల్చినపుడు వెలువడే పొగతో గాలి కలుషితమయింది. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. అంతే కాకుండా అక్కడకి దగ్గర్లోనే ఉన్న అభయా ర ణ్యంలోని జంతువులకు కూడా ప్రాణహాని ఉందని ఎన్‌జీటీ అభిప్రాయపడింది. ఈ కారణంగా హర్యానా ప్రభుత్వ నిర్లక్ష్యధోరణిని నిరసిస్తూ ఎన్‌జీటీ ఆ రాష్ట్ర ప్రభు త్వంపై రూ.100 కోట్లు జరిమానా విధించింది.
ఎన్‌జీటీ ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం ఇది మొదటి సారి కాదు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావ రణ అనుమతులు ఉల్లంఘించింది. ఈ కారణంగా ఎన్‌జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120 కోట్లు జరిమానా వేసింది. ఇదేవిధంగా, పర్యావరణం సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన మూడు ప్రాజె క్టులకే కూడా జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.24.56కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ.73.6 కోట్లు ఎన్‌జిటీ జరిమానా విధించింది.