ఏఐ టెక్నాలజీతో న్యూస్ పేపర్ ప్రింట్ ఎడిషన్!

రిపోర్టర్లు లేరు… సబ్ ఎడిటర్లు లేరు… ప్రూఫ్ రీడర్లు లేరు… పేజీ మేకప్ ఆర్టిస్టుల్లేరు… ఫోటోగ్రాఫర్లు లేరు… ఐనా సరే, డెయిలీ పేపర్ పబ్లిషైంది… ప్రింట్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చేశాయి.

నిజం..  ఇల్ ఫోగ్లియోఅనే ఇటాలియన్ పత్రిక తొలిసారిగా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్   సాయంతో ఒక ఎడిషన్‌ను ప్రచురించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం 2025 మార్చి 18 నుంచి ప్రారంభమైంది, ఒక నెలపాటు కొనసాగుతుంది. జర్నలిజంలో ఏఐ ప్రభావాన్ని పరీక్షించడానికి,  దాని ఉపయోగాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడాని ఈ పత్రికను తీసుకువచ్చినట్లు ఇల్ ఫోగ్లియో సంపాదకుడు క్లాడియో సెరాసా  తెలిపారు. జర్నలిజాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఇదొక సదవ కాశంగా అభివర్ణించారు.  

Teluguone gnews banner