స్పీడ్ న్యూస్ 2
posted on Jul 10, 2023 @ 4:15PM
26. కర్ణాటక అసెంబ్లీలో మరోసారి కలకలం రేగింది. ఇటీవల ఓ సామాన్య వ్యక్తి అసెంబ్లీలోకి చొరబడి, ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన మరువకముందే.. తాజాగా ఓ మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది.
27. ఏపీలో మహిళల మిస్సింగ్, వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
28. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమె ఏడాదిపాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
29.తనకు పీసీసీ చీఫ్ రానందుకు కొన్నిరోజులు బాధపడ్డానని కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం అన్నారు. కానీ తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కతో కలిసి తాను పని చేస్తున్నానని చెప్పారు.
30. భారత చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోన్న విషయాన్ని సినిమా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన్నట్టు ప్రముఖ కాలమిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు.
31.ఓ మహిళ అత్యంత కిరాతక హత్యకు గురైన ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. మహిళ చనిపోయిన తీరు వారిని తీవ్రంగా కలిచి వేసింది. ఆమెను చంపిన నిందితులు.. కళ్ల నుంచి గుడ్లను బయటికి తీశారు. ఆ మహిళ ప్రైవేటు భాగాలపై తీవ్ర గాయాలు చేశారు.
32. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు ఇకపై యాక్సిస్ బ్యాంక్ కు చెందిన పర్సనల్ లోన్స్ పొందొచ్చు. గరిష్ఠంగా 3 ఏళ్ల కాలవ్యవధిపై రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్స్‌ను మంజూరు చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.
33.రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం వెస్టిండీస్ వెళ్లింది టీమిండియా. నెల రోజులపాటు కొనసాగనున్న ఈ టూర్.. జులై 12న డొమినికా వేదికగా జరిగే తొలి టెస్టుతో మొదలుకానుంది.
34. తెలంగాణ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై మెత్తబడ్డారు. పెండింగ్ బిల్లులను జూలై 15లోగా క్లియర్ చేస్తామని తెలంగాణ రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
35. సైకో తరహా విధ్వంసంపై మాజీ సీజేఐ ఎన్వీరమణ చురకలంటించారు. తానా సభలో ఎన్వీరమణ చేసిన ప్రసంగం లో సైకో తరహా విధ్వంసంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తిప్పాలనుకుంటారని దుయ్యబట్టారు.
36. మణిపూర్‌లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.
37.ఈనెల 12న గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ మల్లు రవి వెల్లడించారు. దేశ ప్రజలు ఐక్యంగా ఉండడానికి రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని తెలిపారు.
38. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన వెలుగుచూసింది. బతికుండగానే ఓ వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు.
39. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు భేటీ అయ్యారు. త్వరలో జూపల్లి కాంగ్రెస్‌లో చేరనున్న విషయం తెలిసిందే.
40. స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్‌పై అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు కడియం శ్రీహరి-తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు.
41. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. తానా సభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీతక్కను సీఎంను చేస్తామని ప్రకటించారు.
42. నెల్లూరు పోలీసు కార్యాలయం ట్రెజరీ నిధులలో గోల్ మాల్ జరిగింది. ట్రెజరీలో జమ చేయాల్సిన నిధులలో రూ.150 కోట్ల రూపాయల సొమ్మును పరిపాలనా విధుల్లో పని చేసే కొందరు స్వాహా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
43. తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కూడా కొనసాగుతోంది. ఆదివారం క్యూ లైన్లలో ప్రవేశించినవారు ఈ ఉదయానికి కూడా దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.
44 ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను జగన్ తో భేటీ అయ్యానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ రోజు ఆయన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. తమ జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై చర్చ జరిగిందని చెప్పారు.
45. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగళం అంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. క మంత్రిగా ఉన్న సమయంలో కడియం అనినీతికి పాల్పడ్డారనీ, అవసరం వచ్చినప్పుడు ఆయన ఆస్తులను బయట పెడతామని చెప్పారు.
46. రానున్న ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జులై 12, 13 తేదీల్లో వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
47. తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి విమర్శలు గుప్పించారు. హుస్సేన్ సాగర్ పరిశుభ్రతపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలన్నారు. సెయిలింగ్ వీక్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆమెతెలంగాణకు ఓ గిఫ్ట్ లాంటి హుస్సేన్ సాగర్ ను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అన్నారు. సాగర్ ను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
48. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని వైసీపీ ఎంపి మిథున్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రశక్తే లేదని చెప్పారు. అలాగే జగన్ కేబినెట్ విస్తరణ అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.
49.ఒంగోలులో భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గతంలో ఒంగోలులో ఇలాగే చాలాసార్లు భూమి కంపించిందని.. ఒంగోలులో కొండ ప్రాంతం దిగువన తరచుగా భూమి కంపిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
50. తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్లపై జరిగే ప్రమాదాలను నివారించడానికి నిఘా భద్రతా విభాగం, పోలీసు శాఖా సమన్వయంతో పటిష్టమైన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని టి టి డి కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి నిర్దేశించారు.